రామ్ చరణ్‌తో `నాటు నాటు` పాటకు స్టెప్పులేసిన ఆనంద్ మహేంద్ర..వీడియో వైర‌ల్‌!

హైదరాబాదులో ప్రతిష్ఠాత్మక రీతిలో నిర్వహిస్తున్న ఫార్ములా-ఈ గ్రాండ్ ప్రీ మెయిన్ రేసు శ‌నివారం సాయంత్రం అట్ట‌హాసంగా జ‌రిగింది. నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన రేసింగ్ సర్క్యూట్‌లో ఫార్ములా ఈ రేసు కార్లు వాయు వేగంతో దూసుకెళ్లాయి. వివిధ దేశాల నుంచి వచ్చిన రేసర్లు కార్లలో దూసుకెళ్లారు. ఇక ఈ టోర్నీ వీక్షించేందుకు వచ్చిన సినీ, రాజకీయ, క్రీడా సెలబ్రిటీలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

టాలీవుడ్‌ హీరోలు రామ్‌చరణ్‌, నాగార్జున, నాగచైతన్య, అఖిల్, సిద్దు జొన్నలగడ్డ, క‌న్న‌డ స్టార్‌ హీరో యష్, దుల్కర్ సల్మాన్, అఖిల్, సిద్దు జొన్నలగడ్డ, క్రికెటర్లు సచిన్‌ టెండుల్కర్‌, శిఖర్‌ ధావన్, దీపక్‌ హుడా, యజువేంద్ర చాహల్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్‌, ఏపీ మంత్రి అమర్నాథ్ త‌దిత‌రులు ఫార్ములా-ఈ గ్రాండ్ ప్రీ కార్ రేసింగ్ కు హాజ‌రై సంద‌డి చేశారు.

అలాగే ఈ రేసింగ్ పోటీల‌కు మ‌హీంద్ర టీమ్ త‌ర‌ఫున ఆనంద్ మ‌హీంద్ర హాజ‌ర‌య్యాడు. అయితే ఈయ‌న అక్క‌డే ఉన్న రామ్ చ‌ర‌ణ్ తో క‌లిసి `ఆర్ఆర్ఆర్‌`లోని మోస్ట్ పాపుల‌ర్ సాంగ్ `నాటు నాటు` పాట‌కు స‌ర‌దాగా స్టెప్పులేశాడు. ఈ వీడియోను ఆనంద్ మ‌హీంద్ర ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. రామ్‌చ‌ర‌ణ్ నుంచి నాటు నాటు పాట‌కు బేసిక్ స్టెప్పులు నేర్చుకున్నాన‌ని, ఫార్ములా ఈ రేసింగ్ వ‌ల్ల త‌న‌కు ల‌భించిన రియ‌ల్ బోన‌స్ ఇది అపి ఆనంద్ మ‌హీంద్ర ట్వీట్ చేశాడు. దీంతో ఈయ‌న షేర్ చేసిన వీడియో కాస్త నెట్టింట వైర‌ల్ గా మారింది.

https://twitter.com/anandmahindra/status/1624375994265255937?s=20&t=O7luYjcxENwC1b-NOZyYUQ