గత రెండు సంవత్సరాల నుంచి అక్కినేని ఫ్యామిలీ ఏ పని చేసిన అది వారికి కలిసి రావడం లేదు. అంతేకాకుండా వారి ప్రతి విషయంలోనూ అక్కినేని కుటుంబానికి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతూ వస్తుంది. ఈ కుటుంబం నుంచి మూడోతరం యువ హీరోలు నాగచైతన్య, అఖిల్ నటించిన సినిమాలు కూడా ప్రేక్షకులను మప్పించలేకపోతున్నాయి. ఇదెలా ఉంటే వారి తండ్రి నాగార్జున నటించిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ లగామిగిలిపోతున్నాయి. దీంతో అక్కినేని అభిమానులు కూడా వారిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తుంది.
అక్కినేని కుటుంబానికి కేవలం సినిమాల పరంగానే కాకుండా వారి కుటుంబ పరంగా కూడా ఏం మాత్రం కలిసి రావటం లేదు. ఇప్పటికే నాగార్జున కొడుకులు నాగచైతన్య పెళ్లి చేసుకునీ రెండు సంవత్సరాలు పూర్తవకుండానే విడాకులు తీసుకోవడం, అలాగే చిన్న కొడుకు అఖిల్ కూడా ఎంగేజ్మెంట్ చేసుకుని ఏమైందో కానీ తరవాత పెళ్లికిి నో చెప్పాడు. ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు గత కొన్ని రోజులుగా నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ గా మారాయి.
ఈ వార్తతో అక్కినేని అభిమానులు కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ క్రమంలోనే అక్కినేని అమల నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోవాలంటే ఈ కుటుంబంలో ఖచ్చితంగా అది కూడా జరగాల్సిందే అంటూ ఓ కండిషన్ పెట్టిందట. ఇంతకీ అమల పెట్టిన కండిషన్ ఏమిటంటే.. నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోవాలంటే ఖచ్చితంగా అఖిల్ ని కూడా పెళ్లికి ఒప్పించాలని కండిషన్ పెట్టిందట.
అయితే అఖిల్ కి మాత్రం ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదట.
ఈ విషయంలో అమల మాత్రం అఖిల్ పెళ్లికి ఒప్పుకుంటేనే నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టి కూర్చుందట. ఈ నేపథ్యంలోనే అక్కినేని కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయట. అంతేకాకుండా నాగచైతన్య కూడా అమలపై తీవ్ర కోపంతో ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.