AGENT: వైల్డ్ వీడియోతో రిలీజ్ డేట్ ప్రకటించిన అఖిల్..!!

అక్కినేని నాగార్జున కుమారుడు అక్కినేని అఖిల్ చివరిగా బ్యాచిలర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక తర్వాత వరుసగా విజయాలను అందుకోవాలని ఆచి తూచి అడుగులు వేస్తూ.. ముందుకు వెళ్తున్నారు. ఎంటర్టైన్మెంట్ బ్యానర్ తో అత్యంత భారీ బడ్జెట్ తో డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఏజెంట్. ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరు పొందాలని చూస్తున్నారు అఖిల్. కొన్ని కారణాల చేత ఈ సినిమా రీ షూట్ల కారణంగా విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తూనే ఉంది.

Agent Movie : 30 కోట్ల మార్కెట్ కూడా లేని అఖిల్ 'ఏజెంట్' కి ఇంతఇక అఖిల్ అభిమానుల కోసం తాజాగా నిరీక్షణ ఫలించింది ఫైనల్ గా ఏజెంట్ టీమ్ అక్కినేని అభిమానుల కోసం ఈ రోజున ఒక గుడ్ న్యూస్ తెలియజేసింది. గత కొంతకాలంగా విడుదల తేదీతో ఊరిస్తూ ఉన్న చిత్ర బృందం ఈ సినిమాను ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.భారీ బడ్జెట్ తో పాటు పాన్ ఇండియా మూవీ కాబట్టి సమ్మర్ లో విడుదల చేస్తే పర్ఫెక్ట్ గా ఉంటుందని మేకర్స్ భావించడంతో సమ్మర్ కి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఇక అందుకే సంబంధించి ఒక విషయాన్ని కూడా వెల్లడిస్తూ మేకర్స్ ఒక వైల్డ్ వీడియోను కూడా విడుదల చేశారు. వైల్డ్ గా ఒక వ్యక్తి టార్చర్ చేస్తూ ఒళ్లంతా రక్తం ఓడుతున్న తనెవరో చెప్పకుండా ఎదుటి వ్యక్తి సహాయాన్ని పరీక్షిస్తున్నాడు.. అఖిల్..ఒసామా బిన్ లాడెన్ గడపి హిట్లర్.. పంపాడు బే అంటూ అఖిల్ సమాధానం చెప్పడంతో ఈ వీడియో మరింత హైలెట్ గా నిలుస్తోంది. ముఖ్యంగా అఖిల్ ముఖమంతా రక్తంతో నిండుతూ కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.