నిఖిల్ హీరోయిన్ సీమంతం ఫోటోలు చూశారా..ఎంత ముద్దుగా ఉందో..!

నిఖిల్ హీరోగా వచ్చిన స్వామి రారా సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రముఖ నటి పూజ రామచంద్రన్. ఈ సినిమాలో హీరో నిఖిల్ ఫ్రెండ్స్ లో ఒకరిగా నటించిన ఈమె తన అందం తెలివితేటలతో అందరినీ ఆకట్టుకుంది. తన కర్లీ హెయిర్ తో ఎంతో క్యూట్‌గా కుర్రాళ్ల హృదయాల్లో చోటు దక్కించుకుంది పూజ. ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్2లో కంటెస్టెంట్ గా పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గరయింది.

ఆ తర్వాత వరుస సినిమాలతో ఇటు వెండితెరపై అటు బుల్లితెరపై కూడా తనదైన స్టైల్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. త్వరలోనే పూజ రామచంద్రన్ తల్లి కాబోతోంది. తెలుగు, తమిళ సినిమాల్లో విలన్‌గా అదరగొడుతున్న జాన్ కొక్కెన్‌తో కలిసి ఓ పన్నంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఈ సందర్భంలోనే పూజా సీమంతం వేడుకలు ఎంతో ఘనంగా కనులు పండగ నిర్వహించారు. ఆ ఫోటోలను పూజ తన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంది. పూజ దంపతుల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కాగా పూజ- జాన్ ఇద్దరికీ ఇది రెండో వివాహం. ముందుగా 2010లో విజె క్రెయిగ్ అనే వ్యక్తిని పూజా పెళ్లాడుంది. అయితే కొద్ది రోజులకే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత జాన్ కొక్కెన్‌నుతో 2019 లోవీరి పెళ్లి జరిగింది. ఇప్పుడు వీరి ప్రేమ బంధానికి గుర్తుగా త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోషన్‌ పొందనున్నారు.

స్వామిరారాతో పాటు లవ్‌ ఫెయిల్యూర్‌, త్రిపుర, దోచేయ్‌, దళం, సిద్ధార్థ్‌, ఇంతలో ఎన్నెన్ని వింతలో, వెంకీమామా, ఎంత మంచివాడవురా, పవర్‌ ప్లే, ఇప్పుడు కాక ఇంకెప్పుడు వంటి ల్లో నటించింది పూజ. ఇక జాన్‌ కొక్కెన్‌ విషయానికొస్తే.. తెలుగు, తమిళ భాషల్లో స్టార్‌ విలన్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇటీవల అజిత్‌ నటించిన తునివు (తెలుగులో తెగింపు) లోనూ తన విలనిజంతో ఆకట్టుకున్నాడు. అలాగే మెగాస్టార్‌ చిరంజీవి వాల్తేరు వీరయ్యలోనూ ఓ కీలక పాత్ర పోషించాడు.