ధమాకా సక్సెస్ తో.. ఆ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్న రవితేజ..!!

టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో వరుసగా పలు సినిమాలు రీ రిలీజ్ చేస్తూ అభిమానులను బాగానే ఆకట్టుకుంటున్నాయి.ఇప్పుడు అనూహ్యంగా రవితేజ హీరోగా నటించిన మిరపకాయ్ సినిమాని రీ రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా జనవరి 12వ తేదీన 2011వ సంవత్సరంలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.ఇందులో హీరోయిన్స్ గా రిచా గంగోపాధ్యాయ, దీక్ష సేథ్ నటించారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ గా నటించగా నాగబాబు అజయ్, బ్రహ్మాజీ, రావు రమేష్ తదితరులు కీలకమైన పాత్రలో నటించారు.

Watch Mirapakay Full HD Movie Online on ZEE5అప్పట్లో ఈ సినిమా 104 కేంద్రాలలో 50 రోజులపాటు ఆడింది. ఈ సినిమా ఈ జనవరి 26వ తేదీన రీ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.ఆ రోజున రవితేజ బర్తడే సందర్భంగా మిరపకాయ్ సినిమాను మళ్లీ విడుదల చేయబోతున్నారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ధమాకా సినిమా సూపర్ హిట్ కావడం వల్లే ఈ సినిమా రీ రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ధమాకా చిత్రం రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరింది.. సంక్రాంతి సీజన్ లో రెండు భారీ తెలుగు సినిమాలు రెండు తమిళనాడు సినిమాలు ఒక చిన్న సినిమా బరిలో నిలవడం జరిగింది.

Stills from Ravi Teja's Mirapakayఅయినప్పటికీ కూడా ధమాకా సినిమా కలెక్షన్ల పరంగా బాగానే ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక రవితేజ మిరపకాయ సినిమా మరొకసారి తెరమీద తీసుకురావాలని పలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాల్తేరు వీరయ్య సినిమా విషయంలో కూడా రవితేజ పాత్ర చాలా కీలకంగా ఉందని ఈ సినిమా విజయంలో భాగమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి రవితేజకు రీ రిలీజ్ ఎలా కలిసి వస్తుందో చూడాలి మరి.