ఈ సంక్రాంతి సినిమాలతో ప్రకాష్ రాజ్ సక్సెస్ అయ్యేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణమైన నటుడుగా పేరు పొందారు నటుడు ప్రకాష్ రాజ్. ఈ మధ్యకాలంలో ప్రకాష్ రాజ్ ఫామ్ కోల్పోయారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆయన నటనను అభిమానించే వారిని సంతృప్తి పరిచే విధంగా ఈ మధ్యకాలంలో ఏ సినిమా లేదని చెప్పవచ్చు. పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ నటన గురించి ఇప్పటికి ఎంతోమంది ప్రేక్షకులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అదే తరహాలో ఒక్కడు, ఇడియట్, బొమ్మరిల్లు వంటి చిత్రాలలో తన పాత్రలతో ప్రేక్షకులను కట్టిపడేసేలా చేశారు ప్రకాష్ రాజు.

Prakashraj's true face.. I will not act like that even if I give 50 crores

ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటించగలిగే సత్తా ప్రకాష్ రాజ్ కు ఉన్నది. అందుచేతనే ఎన్నో సినిమాలలో ఆఫర్ల విషయంలో బాగా అందుకుంటూ ఉంటారు. టాలీవుడ్ లో దాదాపుగా అందరూ సీనియర్ ,జూనియర్ స్టార్ హీరోల సినిమాలలో ప్రకాశరాజ్ నటించారు. ఇక ప్రకాష్ రాజ్ ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య మరియు వారసుడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ రెండు సంక్రాంతి సినిమాలలో కూడా ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలోనే నటించారు. తాజాగా విడుదలైన సంక్రాంతి సినిమాల యొక్క ట్రైలర్లు ప్రకాష్ రాజ్ లుక్ విలన్ రోల్స్ అన్నట్లుగా స్పష్టం అవుతుంది.

ఒకవేళ ఈ సినిమాలో సక్సెస్ అయితే ప్రకాష్ రాజ్ గతంలో మాదిరిగా వరుసగా స్టార్ హీరోల సినిమాలలో ఛాన్స్ దక్కించుకొని అవకాశం ఉన్నట్లు సమాచారం.ఈ మధ్యకాలంలో బాలీవుడ్ నుండి విలన్స్ ను దిగుమతి చేస్తూ ఉన్నారు. కానీ వారిలో ఎక్కువ శాతం నిరాశ పరుస్తూ ఉన్నారు. అందుచేతనే ప్రకాస్ రాజ్ మళ్ళీ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ విలన్ గా నిలిచే అవకాశాలు ఉన్నట్లు పలువురు అభిమానులు తెలియజేస్తున్నారు. మరి ప్రకాష్ రాజ్ కెరియర్ను సంక్రాంతి మూవీస్ నిలబెడతాయేమో చూడాలి మరి.