సమంత ఫేస్‌కి ఏమైంది.. ఎందుకలా కనిపిస్తోంది..?

ప్రముఖ నటి సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి ప్రేక్షకులను ముద్దుగుమ్మ ఎంతగానో ఎంటర్టైన్ చేసింది. పాన్ ఇండియా లెవెల్‌లో సూపర్ హిట్ అయిన పుష్ప సినిమాలోని ‘ఉ అంటావా ఊ ఊ అంటావా’ ఐటమ్ సాంగ్‌లో మస్తు హాట్‌గా నర్తించి కేక పుట్టించింది. అయితే కొద్దిరోజులుగా సమంత ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతుంది. దాని కారణంగా ఎక్కువగా బయటకు రావడం మానేసింది. లేటెస్ట్‌గా సమంత తన యశోద సినిమా రిలీజ్ టైమ్‌లో ఒక ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఇక ఆ తరువాత నుంచి సామ్ సరిగా కనపడలేదు. మళ్ళీ ఇప్పుడు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చింది.

అనారోగ్య సమస్యల కారణంగా సమంత కొన్ని రోజులు ట్రీట్‌మెంట్ కోసం విదేశాలకు వెళ్లింది. ఇక ఇటీవలే కోలుకున్న సామ్ చాలా గ్యాప్ తరువాత ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనపడింది కానీ ఇంతకుముందులా యాక్టివ్‌గా కనిపించలేదు. ముఖమంతా లోపలికి పీకుపోయినట్లు కనిపించింది. ఎయిర్‌పోర్ట్‌లో కొంతమంది ఆమెతో సెల్ఫీ తీసుకున్నారు కానీ ఆమె ముఖంలో చిరునవ్వు అస్సలు కనిపించలేదు. ఆమె మయోసైటీస్ వ్యాధి ట్రీట్‌మెంట్ అంతవరకు వచ్చిందో ఎవరికి తెలీదు కానీ ఇప్పుడు ఆమె ఫేస్‌లో హ్యాపీనెస్ యాక్టివ్ నెస్ కనిపించకపోవడం చర్చనీయాంశం అయింది.

సమంత నెక్స్ట్ ఖుషి, శాకుంతలం సినిమాల్లో కనిపించి అలరించనుంది. అయితే శాకుంతలం సినిమాకు వచ్చే నెల 17న రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఖుషి సినిమా షూటింగ్ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. అయితే విజయ్ దేవరకొండ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఖుషి సినిమాపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా రిలీజ్ అయ్యాక రిజల్ట్స్ ఎలా వుంటాయో చూడాలి.