ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్న చిత్రాల్లో విజయ్ దళపతి `వారసుడు(తమిళంలో వరిసు)` ఒకటి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. జయసుధ, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, శ్యామ్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు.
శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి,పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జనవరి 11న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. అయితే తెలుగులో `వారసుడు` చిత్రానికి రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ రూ. 16 కోట్లకు అమ్ముడుపోయినట్లు చెబుతున్నారు. విజయ్ గత చిత్రం `బీస్ట్` ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు రూ. 11 కోట్ల రేంజ్ లో జరిగింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. అదే వేరే విషయం అనుకోండి. అయితే ఇప్పుడు `బీస్ట్` రికార్డును వారసుడు చిత్తు చేసింది. తెలుగులో విజయ్ కెరీర్ లో అత్యధిక బిజినెస్ చేసిన చిత్రంలో కొత్త రికార్డును నెలకొల్పింది. ఇక ఇక్కడ సినిమా క్లీన్ హిట్ అవ్వాలంటే విజయ్ టార్గెట్ రూ. 17 కోట్లు. మరి ఈ టార్గెట్ ను ఆయన అందుకుంటాడా.. లేదా.. అన్నది చూడాలి.