ఏం అందం భయ్యా.. బ్లాక్ శారీలో హాట్ పోజులు ఇస్తూ రెచ్చగొడుతోందిగా..

బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా పాటిస్పేట్ చేసి పాపులర్ అయిన బ్యూటీ భానుశ్రీ. ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్’ తెలుగు సీజన్ 2తో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ 35 రోజులు పాటు తనదైన ఆటతీరుతో చాలామందిని ఆకట్టుకుంది. తెలంగాణ యాసలో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ అందరికీ దగ్గరైన ఈ భామ ఆ తర్వాత సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఇటీవల ‘నల్లమల’ సినిమాతో హీరోయిన్ గా అలరించింది. దీనికంటే ముందు టెంప్ట్ రవి, ఏడు చేపల కథ వంటి బోల్డ్ సినిమాల్లో నటించి సెగలు పుట్టించింది.

నల్లమల సినిమాలో ఈ ముద్దుగుమ్మ కోసం రాసిన ఏమున్నావే పిల్ల ఏమున్నావే పాట సూపర్ హిట్ అయింది. దాంతో ఈ అమ్మడికి పాపులారిటీ మరింత పెరిగిపోయింది. అయితే మంచి సినిమా పడినా కూడా ఈ ముద్దుగుమ్మకు పెద్దగా సినిమా అవకాశాలు రావడం లేదు దాంతో సోషల్ మీడియా వేదికగా తన అందాలను ఆరబోస్తూ దర్శక నిర్మాతల దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు పంచుకుంటోంది.

తాజాగా ఈ అమ్మడు బ్లాక్ శారీలో దిగిన ఫొటోలను పంచుకుంది. భాను ఆ బ్లాక్ శారీలో చాలా అందంగా కనిపించింది. పెదాలకు రెడ్ కలర్‌ లిప్‌స్టిక్, నుదుటిన పెద్దబొట్టు పెట్టుకుని గంగుబాయి అవతారంలో భాను చాలా సెక్సీగా కనిపించింది. ఈ స్టన్నింగ్ ఫొటోలను చూసి అభిమానులు వావ్ అంటూ నోరెళ్లబెడుతున్నారు. ఈ హాట్ భామ ఒక ఫోటోలో బీరు బాటిల్ పట్టుకొని కనిపిస్తే, మరో ఫోటోలో చుట్ట తాగుతూ కనిపించింది. మొత్తంగా హాట్ అండ్ మాస్ అవతార్‌లో జిగేలుమని మెరుస్తూ ఈ పిల్ల అందరి హృదయాలను దోచేస్తోంది.

ప్రస్తుతం బుల్లితెరపై ‘బీబీ జోడీ’ షోలో కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ కొద్ది రోజుల క్రితం తన యూనిక్ వాయిస్‌తో శ్రీ దేవి డ్రామా కంపెనీలో ఒక పాట పాడి ఆశ్చర్యపరిచింది. ఇకపోతే సినిమాల్లో అవకాశాల కోసం మున్ముందు ఈ ముద్దుగుమ్మ ఇంకా ఎంత హాట్ షోతో రచ్చ చేస్తుందో చూడాలి.

Share post:

Latest