మహేష్ కోసం ఆ బాలీవుడ్ హాట్ ఆంటీ ని తీసుకొస్తున్న త్రివిక్రమ్.. కెవ్వు కేక “పెట్టించాల్సిందే”..!

మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న SSMB28వ సినిమా ఇప్పటికే ఓషెడ్యూల్ షూటింగ్ ముగించుకుని.. రీసెంట్‌గా రెండో షెడ్యూల్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ సినిమాను త్రివిక్రమ్ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్‌కు జంటగా పూజ హెగ్డే, శ్రీ లీల నటిస్తున్నారు. మహేష్- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడు సినిమా కావటంతో ఈ సునమ పై టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఆ అంచనాలకు తగ్గట్టు త్రివిక్రమ్ ఈ సినిమాను భారీ స్థాయిలోనే రూపొందిస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. త్రివిక్రమ్ సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ కు మెప్పించే విధంగా ఉంటాయి. ఈ సినిమాను మాత్రం తన పాత సినిమాలుకు భిన్నంగా ఓ మాస్ యాక్షన్ సినిమాగా రియల్ ఇన్సిడెంట్ తో కూడిన కథను త్రివిక్రమ్ రెడీ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం కూడా ఓ క్రేజీ భామను త్రివిక్రమ్ రంగంలోకి దించబోతున్నాడట.

Mahesh Babu and Trivikram Join Hands For SSMB 28

ఈ సినిమాలో ఆ పాట ఎంతో స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఆ పాటకు తగ్గట్టు త్రివిక్రమ్ బాలీవుడ్ నుంచి హాట్ ఆంటీ మలైకా అరోరాను రంగాల్లోకి దించబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మలైకా, పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక సాంగ్ లో చేసింది. ఇక ఆ సాంగ్ కూడా సినిమాలోనే హైలెట్ గా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ మలైక టాలీవుడ్ లో కనిపించలేదు. అయితే గత కొంతకాలంగా మలైకా సోషల్ మీడియాలో రెబల్ క్వీన్ గా వెలిగిపోతోంది. తనకంటే చాలా చిన్నవాడైన యువహీరో అర్జున్ కపూర్ తో రొమాంటిక్ లైఫ్ ని ఆస్వాధిస్తున్న మలైకా నిరంతరం మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తోంది.

Malaika Arora trolled for 'trying to be Kim Kardashian' as she wears THIS under a see-through gown | Celebrities News – India TV

ఈ ఏజ్ లో కూడా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోవటంతో మహేష్ సినిమాలో మలైకాతో ఐటెం సాంగ్ చేయిస్తే సినిమాకే మంచి ఊపు వస్తుందని చిత్ర యూనిట్ భావిస్తుంది. పైగా ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుండంతో ఆ అంచనాలుగు తగ్గట్టు కూడా ఈ సినిమాలో నటీనటులను ఎంపికలు చేస్తుండడం ఆసక్తిని కలిగిస్తుంది. మరి ఈ సినిమాతో త్రివిక్రమ్- మహేష్ కు ఎలాంటి సక్సెస్ ఇస్తాడో చూడాలి.