Trailer: వైలెంట్ గా ఉన్న మైకేల్ మూవీ ట్రైలర్..!!

టాలీవుడ్ లో యంగ్ హీరో సందీప్ కిషన్ కథానాయకుడుగా వస్తున్న పాన్ ఇండియా చిత్రం మైఖేల్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రంజిత్ జై కోడి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సేతుపతి ,వరుణ్ సందేశ్ ,గౌతమ్ మీనన్ ,అనసూయ ,వరలక్ష్మి శరత్ కుమార్ ఇలా ఎంతోమంది కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇక హీరోయిన్గా దివ్యాంశ కౌశిక్ నటిస్తోంది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఈ రోజున ఈ సినిమా ట్రైలర్ను కూడా విడుదల చేయడం జరిగింది. యాక్షన్ తో పాటు రొమాంటిక్ డ్రామా థ్రిల్లింగ్ ఎలివేషన్ నేపథ్యంలో ఈ సినిమాని భావిస్తాయిలో తెరకెక్కించినట్లుగా ఈ ట్రైలర్ చూస్తే మనకి అర్థమవుతోంది.

Michael Official Trailer | Vijay Sethupathi, Sundeep Kishan | Michael Trailer | Universal Cinema - YouTube

ఈ సినిమా ట్రైలర్ ని నందమూరి బాలకృష్ణ విడుదల చేయక తమిళంలో జయం రవి అనిరుద్ రవిచంద్రన్ విడుదల చేశారు.. మలయాళం లో హీరో నవీన్ పాలి విడుదల చేశారు. టీజర్ తో ఆసక్తి పెంచిన ఈ సినిమా ట్రైలర్ కూడా మరింత అంచనాలను పెంచేలా కనిపిస్తోంది సముద్రపు అలలని చూస్తున్న ఒక పిల్లవాడు విజువల్స్ తో ఈ సినిమా ట్రైలర్ మొదలవుతుంది. ఇక గౌతమ్ మీనన్ చెబుతున్న డైలాగులు కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది నటుడు సందీప్ కిషన్ కూడా ఇందులో సిక్స్ ప్యాక్ తో కనిపించబోతున్నారు.

ఇక అనసూయ మరొకసారి ఈ సినిమాలో విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం మొత్తం ఫుల్ మాస్ ఎలివేంట్ ని చేసే విధంగా కనిపిస్తోంది. చివరిగా ఇదంతా కేవలం ఒక అమ్మాయి కోసమే చేస్తున్నావా అంటే నమ్మలేకపోతున్నాను అని గౌతమ్ మీద అని చెప్పే డైలాగ్ ఈ సినిమాకి హైలెట్ గా ఉండేలా కనిపిస్తోంది. ఈ చిత్రం ట్రైలర్ సరికొత్త అనుభూతిని కలిగించే విధంగా ఉన్నది.ఈ సినిమా వచ్చే నెల ఫిబ్రవరి 3వ తేదీన భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.