ఆరు నెల‌ల్లో మూడు సినిమాలు.. ఇక ప్ర‌భాస్ ఫ్యాన్స్ కి పూన‌కాలే!?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేతి నిండా సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది ప్ర‌భాస్ నుంచి వ‌చ్చిన `రాధేశ్యామ్‌` ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. ఈ సంక్రాంతికి ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న `ఆదిపురుష్` చిత్రం విడుద‌ల కావాల్సిన ఉన్నా.. ప‌లు కార‌ణాల వ‌ల్ల రిలీజ్ ను వాయిదా వేశారు.

అయితే తాజాగా ప్ర‌భాస్ ఫ్యాన్స్ కి పూన‌కాలే తెప్పించే న్యూస్ ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. ఆరు నెల‌ల్లో ప్ర‌భాస్ న‌టించి మూడు సినిమాలు విడుద‌ల కాబోతున్నాయి. ఈ లిస్ట్ లో మొద‌ట చెప్పుకోవాల్సి సినిమా `ఆదిపురుష్`. సంక్రాంతి నుంచి ఈ సినిమాను 2023 జూన్ 16కు పోస్ట్ పోన్ చేశారు. ఆ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్‌, ప్ర‌భాస్ కాంబినేష‌న్ లో `స‌లార్` అనే మూవీ రూపుదిద్దుకుంటున్న విష‌యం తెలిసిందే.

ఈ చిత్రం సెప్టెంబర్ 28, 2023న రిలీజ్ కానుంద‌ని చిత్ర యూనిట్ ఇప్ప‌టికే ధృవీకరించింది. ఇక మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ `రాజా డీల‌క్స్‌` అనే సినిమా చేస్తున్నారు. ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న లేకుండానే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రిగిపోతోంది. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంద‌ని ఇన్‌సైడ్ టాక్‌. మొత్తానికి ఈ ఏడాది రెండు రిలీజ్‌లతో పాటు వచ్చే ఏడాది సంక్రాంతికి ఒక సినిమాతో ప్ర‌భాస్ త‌న ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇవ్వ‌బోతున్నాడు.