ఎట్టకేలకు రవితేజకు క్షమాపణలు చెప్పిన కమెడియన్..!!

తెలుగు బుల్లితెరపై ఒకప్పుడు జబర్దస్త్ కమెడియన్ గా పేరు పొందారు షకలక శంకర్. ఆ తర్వాత సినిమాలలో అవకాశాలు రావడంతో పూర్తిగా జబర్దస్త్ మానేసి సినిమాలలోని బిజీగా ఉన్నారు. ఇక అప్పుడప్పుడు మెగా కుటుంబం పై ఎవరైనా కామెంట్స్ చేస్తే వారిపైన విరుచుకుపడుతూ ఉంటారు. గడిచిన రెండు రోజుల క్రితం నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ధమాకా సినిమా సక్సెస్ మీటుగా మాట్లాడడం జరిగింది. అయితే ఆ మాటలు మెగా హీరోలను ఉద్దేశించే మాట్లాడారు అన్నట్లుగా వార్తలు వినిపించాయి ఆ వార్తలకు రియాక్టర్ షకలక శంకర్ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

షకలక శంకర్ ఒక సినిమా సక్సెస్ మీట్లో మాట్లాడుతూ.. ఒక కాంట్రవర్సీ ప్రొడ్యూసర్ పై మాట్లాడుతూ ఓ హీరో అని చూసి వాడు వీడు అని సంబోధించారు. దీంతో అసలు శంకర్ ఎవరిని అన్నాడా ?అనే విషయానికి వస్తే.. మాస్ హీరో రవితేజనే అన్నట్లుగా వార్తలు వినిపించాయి. అసలు విషయంలోకి వెళ్తే బండ్ల గణేష్ ధమాకా సక్సెస్ మీట్ లో అందరూ కూడా రెండు మూడు ట్రై చేసి అదృష్టం కలిసొచ్చి సూపర్ స్టార్స్, మెగాస్టార్ అయిపోతున్నారు అంటూ తెలియజేశారు. ఈ విషయంపై షకలక శంకర్ రియాక్ట్ అవుతూ మొన్న ఒక ప్రొడ్యూసర్ అన్నాడు రెండు మూడేళ్లకే అదృష్టం కలిసొచ్చి మెగాస్టార్లు, సూపర్ స్టార్లు అయిపోతారని వాళ్లు రెండు మూడు ఏళ్లలో స్టార్స్ కాలేదు.

ఎంతో కష్టపడి ఎన్నో ఏళ్లు కష్టపడితే వాళ్ళు ఇలా ఎదిగారు ఎవడో హీరో ఉంటే ఉబ్బిపోయి అలా మాట్లాడకూడదని కూడా తెలిపారు. దీంతో ధమాకా టీం లో బండ్ల ఎదురుగా ఉన్నది కేవలం రవితేజ కాబట్టే రవితేజని ఎవడు అంటావా అంటు ఆయన ఫ్యాన్స్ నేటిజన్స్ ఫైర్ అవుతున్నారు. దీంతో ఏమి చేయలేక షకలక శంకర్ ఒక వీడియో ద్వారా మిమ్మల్ని వాడు వీడు అనేశాను. వీలైతే క్షమించండి..రవితేజ ఫ్యాన్స్ కి థాంక్స్ అంటూ తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.