Teaser: సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న కళ్యాణ్ రామ్ ఆమి గొస్..!!

టాలీవుడ్ లో హీరోగా, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు నందమూరి కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్ ఎప్పుడూ కూడా విభిన్నమైన పాత్రలో నటించాలని చాలా ఆత్రుతగా ఉంటారు. అందుచేతనే తన సినిమాలు ఎప్పుడు కూడా చాలా విభిన్నంగానే ఉంటూ సరికొత్తదనాన్ని ప్రేక్షకులకు అందిస్తూ ఉంటారు. గత సంవత్సరం బింబిసారా చిత్రంతో ప్రేక్షకులను అలరించిన కళ్యాణ్ రామ్ ఈ ఏడాది సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఆ చిత్రమే ఆమీగోష్.

Nandamuri Kalyanram's next titled Amigos- Cinema express

ఈసారి ఈ సినిమాలో త్రిబుల్ రోల్లో నటించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లతో క్యూరియాసిటీ బాగా పెరిగిపోయింది. ఈ చిత్రంలో ఒకే ఫ్రేమ్లో ముగ్గురు కళ్యాణ్ రామ్లుగా కనిపించడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇందులో సిద్ధార్థ, మంజునాథ్, మైకేల్ పాత్రలలో నటించబోతున్నారు. తాజాగా తన పాత్రల గురించి రివిల్ చేసే టీజర్ ని కూడా విడుదల చేయడం జరిగింది. ఈ మూడు పాత్రలను పూర్తిగా ఆస్వాదిస్తారని కథను ఇష్టపడతారని నమ్మకాన్ని తెలియజేస్తున్నారు చిత్ర బృందం. ఇక గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలలో జై లవకుశ సినిమాలో నటించారు.

ఇక ఎన్టీఆర్ లాగే కళ్యాణ్ రామ్ కూడా ఈ చిత్రంలో త్రిపాత్రాభినయంలో నటిస్తున్నట్లు ఈ టీజర్ చూస్తే మనకు అర్థమవుతోంది. అంతేకాకుండా కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే ఈ సినిమాలో బెస్ట్ పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నట్లు కనిపిస్తోంది. ఈ ముగ్గురు కళ్యాణ్ రామ్ ల మధ్య జరగబోతున్న వార్ ఏంటనే విషయం తెలియాలి అంటే థియేటర్లో విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. ఫిబ్రవరి 10వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి టీజర్ కూడా వైరల్ గా మారుతోంది.