ఓ మై గాడ్: ఎన్టీఆర్ పై ఇలాంటి చెత్త రూమరా..?

గత సంవత్సరం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా పాన్ ఇండియా లెవ‌ల్ లో సెన్సేషనల్ హిట్‌గా నిలిచి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాసిని అభిమానులను ఆకర్షించింది. ఈ సినిమాలో రామ్ చరణ్- ఎన్టీఆర్ తొలిసారిగా కలిసి నటించిన సినిమా కూడా ఇదే. ఈ సినిమాతో వీరిద్దరూ పాన్ ఇండియా లవల్‌ లో సూపర్ హిట్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాకు పలు అంతర్జాతీయ వేదికలపై ఎన్నో కీలక పురస్కారాలు కూడా బ్యాక్ టు బ్యాక్ తన ఖాతాలో వేసుకుంటూ వస్తుంది.

తాజాగా న్యూ యార్క్ క్రిటిక్స్ అవార్డుని ఉత్తమ దర్శకుడు కేటగిరీలో రాజమౌళి దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాకి గోల్డెన్ క్లబ్ అవార్డులోనూ రెండు విభాగాల్లో నామినేషన్ సాధించిన విషయం తెలిసిందే. జనవరి 10న కాలిఫోర్నియాలో ఈ అవార్డుల వేదిక జరగనుంది. ఇప్పటికే యూఎస్ లో ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లో ఉన్న ఎన్టీఆర్ జనవరి 10న గోల్డెన్ క్లబ్ అవార్డుల వేడుకల్లో పాల్గొనబోతున్నాడు.. తనతో పాటు ఈ వేడుకల్లో దర్శకుడు రాజమౌళి, రామ్ చరణ్ కూడా పాల్గొనబోతున్నారు.

అయితే ఇప్పుడు ఎన్టీఆర్ గోల్డెన్ క్లబ్ అవార్డుల ప్రధానం జరగనున్న రోజున జనవరి 10న హైదరాబాద్‌లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా సమావేశం కానున్నాడని గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇదిలా వుంటే గతంలో కూడా 2009 ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ టీడీపీ తరఫున ప్రచారం కూడా చేశారు. ఇప్పుడు ఈనెల 26 నుంచి నారా లోకేష్ చేపడుతున్న పాదయాత్రకు మద్దతు ఇచ్చే విషయంపై నారా చంద్రబాబు నాయుడుతో ఎన్టీఆర్ జనవరి 10న ఎంతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా జర‌గనున్న గోల్డెన్ క్లబ్ అవార్డు వేడుక కూడా జనవరి 10 కాలిఫోర్నియాలో జరుగుతుంది. అందులో ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ టీమ్ తో కలిసి పాల్గొనబోతున్నాడు. అక్కడ ఉండాల్సిన ఎన్టీఆర్ అదే రోజు హైదరాబాద్‌లో ఉండటం అన్నది వాస్తవం కాదు.. అంటే ఎన్టీఆర్ జనవరి 10న నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం అవుతున్నారనేది ఒట్టి రూమర్ అని తేలిపోయింది.