ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు..బిగ్ బాంబ్‌పేల్చిన రష్మికా మందన్న..!

ఛ‌లో సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్‌గా పరిచయమైంది అందాల భామ రష్మికా మందన్న. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాఈ ఈ ముద్దుగుమ్మ తర్వాత వరుస‌ సినిమాలు చేస్తూ టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక గత సంవత్సరం పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకుని సూపర్ క్రేజ్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో కూడా వరుస‌ సినిమాలో చేస్తూ బిజీగా ఉంది.

రష్మికా మందన్నసోషల్ మీడియాలో కూడా ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. కొన్నిసార్లు పాజిటివ్ విషయాలతో కొన్నిసార్లు నెగటివ్ విషయాలతో ఆమె పేరు ఎప్పుడూ సోషల్ మీడియాలో నిలుస్తుంది. ఇక ఇటీవల రెండు సందర్భాల్లో ఆమె పేరు వివాదాస్పదంగా మారింది. ముందుగా ఈమె కాంతార సినిమా చూడలేదంటూ ఆమె చేసిన కామెంట్మెంట్ కు కన్నడ ఇండస్ట్రీలో తీవ్రమైన వ్యతిరేకతను తెచ్చుకునీ ట్రోలింగ్‌కు గురైంది. ఆ తర్వాత సౌత్ సినిమాలతో పోలిస్తే బాలీవుడ్‌లో రొమాంటిక్ పాటలు ఎక్కువ అంటూ ఆమె చేసిన కామెంట్ కూడా ఇప్పుడు చాలా మందికి నచ్చలేదు. ఈ రెండు సందర్భాల్లో ఈమె బాగా ట్రోలింగ్ గురైంది.

అందులో కాంతార వివాదానికి కొన్ని రోజులు తర్వాత రష్మిక పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది.. అయితే సౌత్ సినిమాలు గురించి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటిదాకా ఏ వివరణ ఇవ్వలేదు. ఇప్పుడు తాజాగా రష్మిక సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని షేర్ చేసింది..అందులో పర్టికులర్ కాంట్రవర్సీ అని చెప్పకుండా తన మీద సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ గురించి ఆ పోస్టులో స్పందించింది. ‘తాను అందరికీ నచ్చుతానని అందరూ తనను ప్రేమిస్తూనే ఉండాలని అనుకోకూడదని తనకు ఆలస్యంగా తెలిసొచ్చిందని ఆమె వ్యాఖ్యానించడం మరో విశేషం’.

”ఈ సినిమా పరిశ్రమంలో ఉండటం వల్ల అందరి దృష్టి మా మీద ఉంటుంది. సొసైటీలో ప్రేమ, ద్వేషం అనేవి సర్వ సాధారణం. నటీనటులుగా మేం ఎన్నో ఇంటర్వ్యూల్లో, పబ్లిక్ ఫంక్షన్లలో పాల్గొంటాం. అందరితోనూ మాట్లాడతాం. ఈ క్రమంలో కొన్ని విషయాలు వివాదాస్పదం అవుతుంటాయి. నా విషయానికి వచ్చేసరికి నేను మాట్లాడే విధానం, వ్యవహార శైలి, హావభావాలు కొందరికి నచ్చకపోవచ్చు. నేను ఎంతో మంది ప్రేమను కూడా పొందుతున్నా. వాళ్లందరికీ రుణపడి ఉంటా” అని రష్మిక వ్యాఖ్యానించింది.