పైకి మంచి దానిలా కనిపించే సౌందర్య ఆ విషయంలో మహా చెడ్డదట..!

కన్నడ బ్యూటీ సౌందర్య (Soundarya)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కన్నడ బ్యూటీ అయిన ఈమె తెలుగింటి ఆడపడుచులా ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. చేసింది కొన్ని సినిమాలే అయినా అతి తక్కువ సమయంలోనే ఉన్నత స్థానానికి చేరి చివరికి విమాన ప్రమాదంలో మరణించి అందరిని శోకసంద్రంలో ముంచేసింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో సౌందర్యకు విపరీతమైన ఫాలోయింగ్ వుంది. ఎక్స్పోజింగ్ చేయకుండా కేవలం హావ భావాలతో నేచురల్ గా నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ నెగిటివ్ రోల్స్ కూడా చేసింది.

Soundarya Profile Biogarphy Biodata Family Photos

అంతేకాదు కమెడియన్లతో కూడా డాన్స్ చేసి తన గ్రౌండ్ టు ఎర్త్ నేచర్ ని చూపించింది. కష్టపడి పనిచేసే సౌందర్య చాలా మంచి మనసున్న అమ్మాయి. అందుకే తనను అందరూ ఇష్టపడేవారు. సెట్స్ లో కూడా ఆమెతో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యేవారు. నిజానికి పైకి సౌందర్య చాలా కామ్ గా.. కూల్ గా.. అమాయకంగా కనిపిస్తుంది కానీ ఆమె అంత సాఫ్ట్ కాదట. మంచిగా ప్రశాంతంగా ఉన్నంతవరకు ఆమె అంత కూల్ పర్సన్ ఎవరూ ఉండరు.. కానీ ఒక్కసారిగా కోపం వస్తే మాత్రం ఎదుట ఎలాంటి వారున్నా సరే ఆమె కోపానికి బలి అయిపోవాల్సిందేనట.

ముఖ్యంగా సినిమా షూటింగ్స్ అప్పుడు ఎవరైనా తనకు నచ్చని పనులు చేస్తే మాత్రం సౌందర్య (Soundarya) వారిపై మండిపడుతూ చుక్కలు చూపించేదట. ముఖ్యంగా సౌందర్య తో కలిసి నటించిన వారు.. అలాగే సినిమా సంబంధిత వ్యక్తులు ఈ విషయాన్ని తెలుపుతున్నారు. అంతేకాదు కోపం వస్తే సౌందర్య ను వదిలేయడమే బెటర్ లేదంటే ఆమె ఆగ్రహానికి బలై పోవాల్సిందేనట. నిజానికి ఆమెకి తనకున్న తీవ్రమైన కోపమే పెద్ద మైనస్ అయిందని ఆ కారణంగానే తల్లిదండ్రులు చెప్పినా..వారిపై అరిచేసి ఇంటి నుంచి బయటకు వచ్చేసిందట.

అంతేకాదు తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లి చేసుకుని అనవసరమైన తలనొప్పులు తెచ్చుకుందని ఆమె సన్నిహిత వర్గాల వారు చెబుతూ ఉంటారు. అయితే ఏది ఏమైనా సినీ పరిశ్రమ సౌందర్య లాంటి గొప్ప నటిని కోల్పోవడం నిజంగా తీరనిలోటు అని చెప్పవచ్చు.