`ధ‌మాకా` హిట్ అయినా ర‌వితేజ భారీగా న‌ష్ట‌పోయాడ‌ని మీకు తెలుసా?

మాస్ మ‌హారాజా ర‌వితేజ నుంచి రీసెంట్ గా విడుద‌లైన `ధ‌మాకా` సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా నిర్మాత‌ల‌కు మంచి లాభాల‌ను అందిస్తోంది. అయితే ఈ సినిమా పెద్ద హిట్ అయినా.. ర‌వితేజ మాత్రం భారీగా న‌ష్ట‌పోయార‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

గ‌త కొంత కాలం నుంచి ర‌వితేజ రెమ్యున‌రేష‌న్ కు బ‌దులుగా లాభాల్లో వ‌చ్చే షేర్‌ను తీసుకుంటున్నారు. అలా `క్రాక్‌` సినిమాకు దాదాపు రూ. 15 కోట్ల వరకు ప్రాఫిట్ అయితే ర‌వితే పొందారు. అయితే ఆ తర్వాత అదే తరహాలో ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాల‌కు కూడా ర‌వితేజ‌ షేర్ డీల్ మాట్లాడుకున్నారు. కానీ, ఈ రెండు సినిమాలు దారుణంగా నష్టాలను కలుగజేసాయి.

దీంతో ర‌వితేజ రిస్క్ చేయ‌డం ఇష్టంలేక‌ `ధ‌మాకా` సినిమాకు సేఫ్‌గా రూ. 15 కోట్ల‌కు పైగా రెమ్యున‌రేష‌న్ ను తీసేసుకున్నారు. క‌ట్ చేస్తే ధ‌మాకా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. నిజానికి ర‌వితేజ షేర్ లో డీల్ తీసుకుని ఉండుంటే.. రూ. 25 కోట్లకు పైగా వాటా వచ్చేది. కానీ, సైలెంట్ గా రెమ్యునరేషన్ తీసుకుని సైడ్ అవ్వ‌డం వ‌ల్ల ర‌వితేజ దాదాపు రూ. 10 కోట్ల వ‌ర‌కు న‌ష్ట‌పోయారు.