రామ్ చరణ్.. శ్రియ అన్ సీన్ వీడియో వైరల్..!!

మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. మొదట చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలలో నటించి టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరిగా మారిపోయారు. ప్రస్తుతం రామ్ చరణ్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి ఇదంతా పక్కన పెడితే.. టాలీవుడ్ హీరోయిన్ శ్రియ గురించి రాంచరణ్ గురించి ఒక విషయం వైరల్ గా మారుతోంది వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

శ్రియ ఇష్టం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమయ్యింది. ఇక తన అందం అభినయంతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. అలా టాలీవుడ్ లో చిరంజీవి బాలకృష్ణ ,నాగార్జున ,వెంకటేష్ వంటి సీనియర్ హీరోలతో కూడా నటించింది. ఆ తరువాత పవన్, మహేష్ ,ప్రభాస్ తదితర హీరోలతో కూడా నటించే అవకాశాన్ని అందుకుంది. అయితే రామ్ చరణ్ ,శ్రియ కు సంబంధించి ఒక విడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. ఇందులో ఒక యాక్ట్ స్కూల్లో సంబంధించి స్కిల్స్ నేర్చుకుంటూ కనిపించారు రామ్ చరణ్.

అయితే రామ్ చరణ్ తో పాటు హీరోయిన్ శ్రియ కూడా ఈ వీడియోలో కనిపించడం విశేషం.ఇద్దరు కలిసి ఒకే సీన్ రిహార్సల్ చేస్తూ దర్శనమిచ్చారు. ఈ వీడియోలో వారిని చూస్తుంటే ఇద్దరు అప్పటికి ఇండస్ట్రీలోకి రాలేదని తెలుస్తోంది. వీరిద్దరూ ముంబైలో శిక్ష తీసుకున్నట్లు సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారుతుంది రామ్ చరణ్ , శ్రియ అభిమానులు ఈ వీడియో చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.