తండ్రి అయిన `అర్జున్ రెడ్డి` న‌టుడు.. సంక్రాంతి రిలీజ్ అంటూ పోస్ట్‌!

`అర్జున్ రెడ్డి` సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ప్ర‌ముఖ న‌టుడు, క‌మెడియ‌న్ రాహుల్ రామకృష్ణ గురించి ప్రత్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తొలి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయిన రాహుల్ రామ‌కృష్ణ‌.. ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో దూసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా రాహుల్ రామ‌కృష్ణ తండ్రి అయ్యాడు.

ఈ శుభ‌వార్త‌ను ఆయ‌న స్వ‌యంగా సోష‌ల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశాడు. కొన్ని రోజుల ముందు భార్య ను ప‌రిచ‌యం చేస్తూ ఆమెతో లిప్ లాక్ చేస్తున్న ఫొటోను షేర్ చేశారు రాహుల్ రామ‌కృష్ణ‌. అప్ప‌ట్లో ఈ ఫోటో తెగ వైర‌ల్ అయింది. ఆ త‌ర్వాత వీరి పెళ్లి జ‌రిగిన‌ట్లు ఎక్క‌డా న్యూస్ రాలేదు. మ‌రి ఆమెను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడో తెలియ‌దు కానీ.. త‌న భార్య ప్రెగ్నెంట్ అని చెప్పి ఓ రోజు అంద‌రికీ షాకిచ్చాడు.

ఇక తాజాగా రాహులు భార్య పండంటి మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. సంక్రాంతి పండుగ రోజున కొడుకు పుట్టాడ‌ని రాహుల్ తెలిపారు. సంక్రాంతి రిలీజ్ అంటూ తన కొడుకు ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేశాడు. దీంతో నెటిజ‌న్లు రాహుల్ దంప‌తుల‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

https://twitter.com/eyrahul/status/1614806302345293829?s=20&t=iXBNWDs_YnjWjgIL1wQ3LQ