అన్‌స్టాప‌బుల్‌లో మెగాస్టార్‌పై షాకింగ్ ప్ర‌శ్న వేసిన బాల‌య్య‌.. ప‌వ‌న్ రిప్లే ఇదే…!

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షోపై రోజురోజుకు భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. న్యూ ఇయర్ కానుకగా వచ్చిన బాలయ్య, ప్రభాస్ తో ఆహా యాప్ షేక్ అయిపోయింది. ఈ ఎపిసోడ్ కేవలం ఐదు రోజుల్లోనే కోటికి పైగా వ్యూస్ రాబట్టుకుంది. ఇప్పుడు ఈ రికార్డులను తిరగ రాయడానికి పవన్ కళ్యాణ్ వచ్చేస్తున్నాడు.

తన కెరిర్‌లో తొలిసరిగా పవన్ ఒక టాక్‌ షో కి వెళ్ళటం.. అందులోనూ అది బాలయ్య హోస్ట్‌ గా చేయడంతో అందరూ ఈ ఎపిసోడ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఎపిసోడ్ షూటింగ్ కు వెళ్లినవారు అక్కడ బాలయ్య అడిగిన ప్రశ్నలకు పవన్ ఎలా ?స్పందించారనేది చెప్పి మరింత హైప్స్ ని క్రియేట్ చేస్తున్నారు. ఈ షోలో బాలయ్య- పవన్ ను బాగానే ఆడుకున్నాడట.. ఎవరు ఊహించని ప్రశ్నలతో పవన్ దగ్గర నుంచి సమాధానం కూడా రాబట్టినట్టు తెలుస్తుంది.

Pawan Kalyan Hugs Balakrishna | Pawan Kalyan With Balayya | Unstoppable 2 With NBK - YouTube

ఇప్పటికే అందుతున్న‌ సమాచారం ప్రకారం పవన్ మూడు పెళ్లిళ్ల గురించి, ఆయన అహర్యం గురించి, టిడిపి పొత్తు గురించి బాలయ్య ప్రశ్నించినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా బాలయ్య పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి గురించి కూడా ప్రశ్నించినట్లు తెలుస్తుంది. ఇక మీరు మీ అన్నయ్య చిరంజీవి దగ్గర నుంచి ఏమి నేర్చుకున్నారని బాలయ్య అడ‌గగా.. ఇక పవన్ అన్నయ్య నుంచి కష్టపడే స్వభావం నేర్చుకున్నానని, దానివలన ఇప్పుడు ఇలా ఉన్నానని చెప్పుకొచ్చాడట పవన్.

మెగాస్టార్ చిరంజీవి గురించి మనం ఎంత చెప్పుకున్న తక్కువే ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా తన స్వయంకృషితో టాలీవుడ్ లో ఓ మూల స్తంభంగా ఎదిగాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్- బాలయ్య ఎపిసోడ్ కు సంబంధించిన ఈ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.