క‌ళ్లు చెదిరే రీతిలో `వీర సింహారెడ్డి` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. రికార్డులు చెల్లాచెద‌రు!?

నట‌సింహ నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మాస్ ఎంట‌ర్టైన‌ర్ `వీర సింహారెడ్డి`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రంలో శ్రుతి హాసన్, హ‌నీ రోజ్‌ హీరోయిన్లుగా నటించారు. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు కీలకపాత్రలను పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతోంది.

ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన పోస్ట‌ర్స్, గ్లింప్స్‌, టీజ‌ర్‌, సాంగ్స్ సినిమా పై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేశారు. బాల‌య్య గ‌త చిత్రం అఖండ బ్లాక్ బస్ట‌ర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు గోపీచంద్‌ బాల‌య్యకు మ‌రో హిట్ ప‌క్కా అంటూ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో ఈ సినిమాకు క‌ళ్లు చేదిరే రీతిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు రూ. 76 కోట్ల వ‌ర‌కు జ‌రిగిన‌ట్లు చెబుతున్నారు.

ఒక్క నైజాం ఏరియాలోనే రూ. 22 కోట్ల‌కు ఈ సినిమా థియేట్రిక‌ల్ రైట్స్ అమ్ముడుపోయిన‌ట్లు స‌మాచారం. సీడెడ్‌లో రూ. 15 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5 కోట్లు, గుంటూర్‌లో రూ. 6 కోట్ల వ‌ర‌కు బిజినెస్ జ‌రిగింది. మొత్తంగా ఏపీ, తెలంగాణ ఏరియాల్లో క‌లిపి ఈ సినిమాకు రూ. 66 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ఇక‌ క‌ర్ణాట‌కలో రూ. 7 కోట్లు, ఓవ‌ర్సీస్‌లో రూ. 3 కోట్లకు ఈ మూవీ రైట్స్ ను కొనుగోలు చేశార‌ట‌. ఓవ‌రాల్‌గా రూ. 76 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన‌ ఈ చిత్రం.. బాల‌య్య పాత రికార్డుల‌ను చెల్లా చెద‌రు చేసింది. బాల‌య్య కెరీర్ లో అత్య‌ధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగిన సినిమాగా రికార్డు సృష్టించింది.