ఎన్టీఆర్ మిస్ చేసుకున్న మెగాస్టార్ హిట్ మూవీ.. అదేంటో తెలుసా?

సినీ పరిశ్రమలో ఒక హీరో కోసం అనుకున్న సినిమాను మరో హీరో చేయడం సర్వసాధారణం. ఇలాంటి సందర్భమే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఎదురయింది. ఓ రీమేక్ మూవీని ఎన్టీఆర్ అనుకోకుండా మిస్ చేసుకున్నాడు. అయితే అదే రీమేక్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు.

ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. `ఖైదీ నెంబర్ 150`. అవును మీరు విన్నది నిజమే. ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ విషయాన్నీ స్వ‌యంగా బయటపెట్టాడు. `వీర సింహారెడ్డి` స‌క్సెస్ జోష్ లో ఉన్న గోపీచంద్‌.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ విష‌యాన్ని రివిల్ చేశాడు. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన `కత్తి` సినిమాను తెలుగులో ఎన్టీఆర్ తో రీమేక్ చేయాలని గోపీచంద్ ముందుగా అనుకున్నాడ‌ట‌.

ఇదే విషయాన్ని డైరెక్టర్ మురగదాస్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన కూడా బాగుంటుందని చెప్పి స్వయంగా ఎన్టీఆర్ తో మాట్లాడార‌ట‌. అయితే వీరు చర్చల్లో ఉన్న సమయంలోనే అనూహ్యంగా చిరంజీవి `క‌త్తి` సినిమా రీమేక్ హక్కులను కొనేశార‌ట‌. ఖైదీ నెంబర్ 150 టైటిల్ తో చిరు ఈ సినిమాను రీమేక్ చేసి సూపర్ హిట్ ను అందుకుని గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చారు. మొత్తానికి అలా మెగాస్టార్ హిట్ మూవీని ఎన్టీఆర్ అనుకోకుండా మిస్ అయ్యాడు.