సెకండ్ ఇన్నింగ్స్ లో సక్సెస్ కాలేకపోతున్న ఫ్యామిలీ హీరో..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అప్పట్లో ఎంతో మంది హీరోలు సైతం ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా అలరించేవారు. అలాంటి వారిలో నటుడు శ్రీకాంత్ కూడా ఒకరు. ఎన్నో చిత్రాలలో విలన్ గా సైడ్ క్యారెక్టర్ల గా నటించి ఆ తర్వాత హీరోగా మారి మంచి బ్లాక్ బస్టర్ విజయాలను కూడా అందుకున్నారు. ఇక తన కెరియర్ లో ఎన్నో మల్టీ స్టార్ చిత్రాలలో కూడా నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యారు. అయితే ఈ మధ్యకాలంలో హీరోగా ఫెయిల్యూర్ కావడంతో విలన్ గా పలు సినిమాలలో నటించారు.

Meka Srikanth turns villain again!
కానీ విలన్ గా మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించిన మరొక హీరో జగపతిబాబు మాత్రం విలన్ గా కూడా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటున్నారు. గతంలో కంటే ప్రస్తుతం పలు అవకాశాలు ఇతర భాషలలో కూడా ఎక్కువగానే వస్తున్నాయి జగపతిబాబుకు. అయితే జగపతి బాబును చూసి శ్రీకాంత్ కూడా సెకండ్ డేంగ్స్ విలన్ గా మారినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ వయసు 54 సంవత్సరాలు.. మొదట యుద్ధం శరణం అనే చిత్రంతో పూర్తిస్థాయిలో తన విలనిజాని చూపించారు.

Akhanda' actor Srikanth tests positive for Covid-19 | Telugu Movie News -  Times of India

ఆ తర్వాత మలయాళం లో దివిలన్ అనే సినిమా కన్నడలో పలు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించారు.తెలుగులో మాత్రం అఖండ సినిమాలో విలన్ గా నటించి మెప్పిస్తారనుకుంటే.. ఈ చిత్రంలో శ్రీకాంత్ కంటే మరొక విలన్కు క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఒక రకంగా ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతిబాబు మాత్రమే సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. శ్రీకాంత్ మాత్రం విలన్ గా సక్సెస్ కాలేకపోతున్నారు. ప్రస్తుత శ్రీకాంత చేతిలో హంట్ అనే సినిమా మాత్రమే మిగిలి ఉంది. మరి ఈ సినిమాతో నైనా సక్సెస్ అవుతారమో చూడాలి.