`ఎన్టీఆర్ 30` నుంచి రెండు గుడ్‌న్యూస్‌లు.. ఎగిరి గంతేస్తున్న ఫ్యాన్స్‌!

`ఆర్ఆర్ఆర్‌` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్టర్ అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో చేయబోతున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో తెర‌కెక్క‌బోయే ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై మిక్కిలినేని సుధాక‌ర్ భారీ బ‌డ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించ‌బోతున్నారు.

తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ మూవీకి మ్యూజిక్ అందించ‌బోతున్నాడు. అయితే ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేసి చాలా కాలమే అయ్యింది. కానీ ఇప్పటివరకు షూటింగ్ ప్రారంభం కాలేదు. ఒకానొక ద‌శ‌లో ఈ సినిమా ఆగిపోయింద‌న్న ప్ర‌చారం కూడా జ‌రిగింది. మ‌రోవైపు అభిమానులు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు ప‌ట్టాలెక్కుతుందా అని ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్నారు.

అయితే వారి ఎదురు చూపుల‌కు తెర ప‌డ‌బోతోంది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా నుంచి ఫాన్సీ ఎగరి గంతేసే రెండు గుడ్ న్యూస్ లు బయటకు వచ్చాయి. అందులో `ఎన్టీఆర్ 30` రిలీజ్ డేట్ అప్డేట్ ఒకటి కాగా.. మ‌రొక‌టి షూటింగ్ అప్డేట్. ఈ మూవీని ఏప్రిల్ 5, 2024లో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు తాజా మేక‌ర్స్ ఓ పోస్ట‌ర్ ద్వారా అనౌన్స్ చేశారు. అలాగే వ‌చ్చే నెల నుంచి షూటింగ్ ప్రారంభం కానుంద‌ని ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. ఈ రెండు అప్డేట్స్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

https://twitter.com/YuvasudhaArts/status/1609423443589726211?s=20&t=R–q_ypBnT1Bn4SA9ACcyA