ఆక‌ట్టుకుంటున్న `క‌స్ట‌డీ` గ్లింప్స్‌.. నాగ చైత‌న్య న్యూ ఇయ‌ర్ ట్రీట్ అదిరింది!

గ‌త ఏడాది `థ్యాంక్యూ` మూవీతో ప్రేక్ష‌కుల‌ను తీవ్రంగా నిరాశ ప‌రిచిన యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య‌.. ప్ర‌స్తుతం వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో `క‌స్ట‌డీ` అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి హీరోయిన్ గా న‌టిస్తుంటే.. అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, ప్రేమ్ జీ అమరన్, ప్రేమి విశ్వనాథ్, సంపత్ రాజ్ వంటి భారీ తారాగ‌ణం ఈ చిత్రంలో భాగ‌మ‌య్యారు.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యాన‌ర్ శ్రీ‌నివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 12న తెలుగు, త‌మిళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. అయితే న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా మేక‌ర్స్ తాజాగా క‌ష్ట‌డీ మూవీ గ్లింప్స్ ను బ‌య‌ట‌కు వ‌దిలారు. ఈ గ్లింప్స్ జస్ట్ 26 సెకన్లు. అందులో విజువల్స్ నిడివి బాగా తక్కువ. అయితేనేం అదిరిపోయింది.

ఇందులో చూపిన యాక్షన్ సన్నివేశాలు పవర్ ఫుల్ గా ఉన్నాయి. సినిమాలో యాక్షన్ ఎలా ఉండబోతోందనేది వెంకట్ ప్రభు ఈ చిన్న గ్లింప్స్ ద్వారా స్ప‌ష్టంగా చూపించారు. కథకి సంబంధించిన ఎలాంటి క్లూ వ‌ద‌ల‌క‌పోయినా.. నాగ చౌత‌న్య ఈసారి ఏదో ప్ర‌యోగ‌మే చేస్తున్నాడ‌ని గ్లింప్స్ బ‌ట్టి తెలుస్తోంది. మొత్తానికి ఆక‌ట్టుకుంటున్న `క‌స్ట‌డీ` గ్లింప్స్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది.