త్రిష లైఫ్‌లో ఆ స్టార్ హీరో చాలా స్పెషల్… ఎందుకంటే..?

సౌత్ స్టార్ హీరోయిన్ లలో త్రిష కూడా రెండు దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోయిన్‌గా కొనసాగుతుంది. ఈ సీనియర్ ముద్దుగుమ్మ ముందుగా కోలీవుడ్‌లో తన కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత టాలీవుడ్ లో వర్షం సినిమాలో ప్రభాస్ కు జంటగా నటించింది. ఈ వర్షం సినిమా తెలుగులో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా అటు ప్రభాస్ కెరియర్ లో కూడా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

Trisha Biography, Age, Family & Movies - MixIndia

ఇక ఈ సినిమా తర్వాత వరుస‌ అవకాశాలతో తెలుగులో దూసుకుపోయింది త్రిష.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా మారిపోయింది. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరితో త్రిష నటించి అలరించింది. కోలీవుడ్ లో కూడా ఈ బ్యూటీ క్రేజ్ అంతకంతకు పెంచుకుంది.ఈ ముద్దుగుమ్మ సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించింది. ఈ విషయాలు పక్కన పడితే త్రిష తన కెరియర్ లో చాలామంది నటులతో నటించింది. అయితే తన కెరీర్‌లో తన సినిమాల‌లో తండ్రిగా, మామగా , బాయ్ ఫ్రెండ్ గా నటించిన నటుడు ఎవరో మీకు తెలుసా.

Abhiyum Naanum': Revisiting Trisha-Prakash Raj's rare film on dad-daughter  dynamic | The News Minute

ఆ నటుడు మరెవరో కాదు వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్.. తెలుగులో త్రిష తొలి సినిమా వర్షం. ఆ తర్వాత వచ్చిన ఆకాశమంత, ఇక రీసెంట్ గా వచ్చిన కోలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ పొన్నియన్ సెల్వన్ సినిమాలో కూడా ప్రకాష్ రాజ్ త్రిషకు తండ్రిగా నటించాడు. ఇక అలాగే ప్రభుదేవా దర్శకత్వంలో సిద్ధార్థ్‌ హీరోగా వ‌చ్చిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో హీరోకు తండ్రిగా నటించాడు.. అంటే ఆ సినిమాలు త్రిషకు మామగారుగా నటించాడు.

Ponniyin Selvan Actress Trisha Reacts To Prakash Raj Love Failure Video  Vijay Gilli | Trisha-Prakash Raj: முத்துப்பாண்டியின் நிறைவேறாத காதல்....  பிரகாஷ் ராஜ் பகிர்ந்த வீடியோ ...

అలాగే మహేష్ బాబు- గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఒకడు సినిమాలో కూడా ఆమెకు బాయ్ ఫ్రెండ్ లా నటించాడు ప్రకాష్ రాజు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ త్రిషకు తండ్రిగా పొన్నియన్స్ సెల్వన్ 2 సినిమాలో నటిస్తున్నారు. అలాగే ఈ రాంగి అనే సినిమాలో కూడా తండ్రీ కూతుళ్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పొన్నియన్ సెల్వన్ సినిమాలో త్రిష తన అందంతో కట్టిపడేసింది . ఆ సినిమాలో ఐశ్వర్య రాయ్ కంటే అందంగా కనిపించి ఆకట్టుకుంది. వయసు పెరుగుతున్నాకొద్ది త్రిష అందం కూడా పెరుగుతూ వస్తోంది.

Share post:

Latest