జాన్వీ ధ‌రించిన ఆ రెడ్ డ్రెస్ ఖ‌రీదు తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది!

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దివంగ‌త న‌టి శ్రీ‌దేవి కూతురిగా బాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. అక్క‌డ వ‌రుస పెట్టి సినిమాలు చేస్తోంది. కానీ, స‌రైన హిట్ మాత్రం ల‌భించ‌డం లేదు. అయితే సినిమాల ఫ‌లితాలు ఎలా ఉన్నా.. జాన్వీకి సోష‌ల్ మీడియా ద్వారా భారీ ఫాలోయింగ్ ఏర్ప‌డింది.

అందాల ఆర‌బోత‌లో ఈ అమ్మ‌డు ఎలాంటి బౌండ‌రీలు పెట్టుకోకుండా క్లీవేజ్ షో చేస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు గ్లామ‌ర‌స్ ఫోటో షూట్ల‌తో కుర్ర‌కారు గుండెళ్లో మంట‌లు రేపుతుంటుంది. ఇక తాజాగా ఈ హాట్ బాంబ్‌ అలెక్స్ పెర్రీ రెడ్ డిజైనర్ డ్రెస్ లో మ‌రింత హాట్ గా ద‌ర్శ‌న‌మిచ్చింది.

స్వీట్ హార్ట్ నెక్ లైన్, నాట్డ్ ఫ్రంట్, బాడీకాన్ ఫిట్ లుక్ తో ఈ డ్రెస్ డిజైన్ అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. మోకాళ్ల పైకి ఉన్న ఈ రెడ్ డ్రెస్ లో జాన్వీ మ‌రింత అందంగా మెరిసిపోతోంది. అయితే ఇప్పుడు ఈ రెడ్ డ్రెస్‌ ఖ‌రీదు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఎంతో సింపుల్ గా ఉన్న ఈ రెడ్ డ్రెస్ ఖ‌రీదు అక్ష‌రాల రూ.72వేలు. ఈ విష‌యం తెలిసి నెటిజ‌న్ల‌కు దిమ్మ‌తిరిగిపోతుంది.