పెళ్లి పీటలు ఎక్కబోతున్న శర్వానంద్.. అమ్మాయి ఎవరంటే..?

ఇక టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా ఉన్న హీరోలు ఎందరో ఉన్నారు. వారికి 40 సంవత్సరాలు వస్తున్న వచ్చిన పెళ్లి చేసుకోవడానికి ఇంకా ఆశక్తి చూపటం లేదు. వారిలో ప్రధానంగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ మ‌రియు ఇప్పుడున్న యువ‌ హీరోలు కూడా ఎందరో పెళ్ళికి దూరంగా ఉంటున్నారు. అయితే వారిలో ఇప్పుడు ఓ యువ హీరో పెళ్ళికి రెడీ అయినట్టు తెలుస్తోంది .

Sharwanand to get married soon? - Lovely Telugu

ఆ యువ హీరో మరెవరో కాదు హీరో శర్వానంద్ త్వరలోనే ఓ ఎన్నారై అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం. ఆమె రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారెనని ఆమె కొన్ని నెలల క్రితం వరకు అమెరికాలో ఉండేవారనీ ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాల కారణంగా, ఆమె ఇప్పుడు తన స్వస్థతలమైన హైదరాబాదులో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Sharwanand, Rashmika Mandanna's 'Aadavallu Meeku Johaarlu' release  postponed | Telugu Movie News - Times of India

శర్వానంద్ కు ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడానికి ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయించినట్టు తెలుస్తోంది .శర్వానంద్‌కు కూడా 38 ఏళ్ల వయసు వచ్చింది. దాదాపు 15 సంవత్సరాలుగా సినిమా పరిశ్రమంలో ఉన్నారు. గొప్ప సంపన్న కుటుంబం నుంచి వచ్చిన శర్వానంద్ స్టార్ హీరోగా స్థిరపడ్డాడు. ఇక అతి త్వరలోనే తన పెళ్లికి సంబంధించిన వార్తతో తన అభిమానులను ఖుషి చేయబోతున్నాడని తెలుస్తుందింది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.