`డాడీ` మూవీలో చిరంజీవి కూతురు ఇప్పుడెలా ఉందో చూస్తే షాకైపోతారు!

మెగాస్టార్ చిరంజీవి, సిమ్రాన్ జంట‌గా న‌టించిన చిత్రాల్లో `డాడీ` ఒక‌టి. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాకు సురేష్ కృష్ణ దర్శకుడిగా పనిచేశాడు. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతిథి పాత్రను పోషించాడు. చిరు కెరీర్‌లో హైలీ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ మూవీ ఇది. క‌మ‌ర్షియ‌ల్ గా ఈ మూవీ హిట్ అవ్వ‌లేరు. కానీ, చిరంజీవి అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు మాత్రం ఈ సినిమా చాలా బాగా నచ్చేసింది.

ఇక‌పోతే ఈ సినిమాలో చిరంజీవి కూతురుగా న‌టించిన పాప గుర్తిండే ఉంటుంది. డాడీ మూవీలో డ్యూయ‌ల్ రోల్ చేసింది. అయితే ఆ పాప పేరు అనుష్క మల్హోత్రా. ఈ అమ్మ‌డు చాలా పెద్ద‌ది అయింది. అస‌లు అనుష్క మల్హోత్రా ఇప్పెడెలా ఉందో చూస్తే షాకైపోతారు. డాడీ త‌ర్వాత అనుష్క మల్హోత్రా హిందీలో ఓ సినిమా చేసింది. అంతే రెండు సినిమాల‌తో న‌ట‌కు పులిస్టాప్ పెట్టేసి.. చదువుల మీద దృష్టి సారించింది.

ప్రస్తుతం యుక్త వయస్సులో ఉన్న అనుష్క మల్హోత్రా.. హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోని అందంతో ఆక‌ట్టుకుంటోంది. ఇంకా చెప్పాలంటే కొంద‌రు హీరోయిన్లు కూడా ఆమె ముందు దిగ‌దుడుపే. అయితే న‌ట‌న‌పై ఇంట్రెస్ట్ లేకపోవడంతో లండన్ వెళ్లిపోయి అక్కడ డిగ్రీ చేసిన అనుష్క మ‌ల్హోత్ర‌.. ప్ర‌స్తుత మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ గా రాణిస్తుంది. హీరోయిన్ గా బాలీవుడ్ నుంచి ఆఫ‌ర్లు వ‌స్తున్నా.. అనుష్క రిజెక్ట్ చేస్తుంది. ఇష్టమైన రంగంలో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తోంది.