చిరంజీవిపై కమెడియన్ ఆలీ షాకింగ్ కామెంట్స్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడుగా కమెడియన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు కమెడియన్ ఆలీ. ఈ మధ్యకాలంలో బుల్లితెరపై ప్రసారమవుతున్న అనేక టీవీ షో కార్యక్రమాలలో జడ్జిగా, హోస్ట్ గా, గెస్ట్ గా కూడా బాగా అలరిస్తూ ఉన్నారు. స్టార్ హీరోల సినిమాలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సుమతో కలిసి ఎన్నో వాటికి హోస్టుగా చేశారు. ఇలా ఇండస్ట్రీలో డైరెక్టర్ ప్రొడ్యూసర్ల హీరోల డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటే స్టార్ హీరోలు అందరూ కూడా కమెడియన్ ఆలీ తమ సినిమాలలో నటించాలని ఎదురు చూసేవారట. అలా అంతటి క్రేజ్ సంపాదించుకున్నారు ఆలీ.

ఇక ఇటీవలే సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని కూడా ప్రారంభించారు. అందులో తనకు సంబంధించిన పలు వీడియోలను సైతం షేర్ చేస్తూ ఉంటారు. ఒకవైపు సినిమా పరంగా బిజీగా ఉండగానే మరొకవైపు రాజకీయాలలో కూడా తన హవా కొనసాగిస్తూ ఉన్నారు. రీసెంట్గా ఆలీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ ఎలక్ట్రానిక్ మీడియా పదవి లభించింది. ప్రస్తుతం ఈ పదవి కారణంగా బుల్లితెరకు గుడ్ బై చెప్పేశారు ఆలీ. ఈ షో బదులు సుమ ఆడ్డా అనే ఒక కొత్త షో ప్రారంభించింది.

ఈ ప్రోమోలో జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ , కమెడియన్ ఆలీ, పోసాని కృష్ణ మురళి కూడా పాల్గొనడం జరిగింది. సుమ షో అంటే కచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెప్పవచ్చు. తన కామెడీ పంచలతో ప్రేక్షకులను బాగా అలరించింది సుమ.. జానీ మాస్టర్ గురించి మాట్లాడుతూ జానీ మాస్టర్ కావాలని అమ్మాయిలను గుద్దటానికి రోడ్డుమీదికి వెళుతూ ఉంటారని పంచులు వేసింది.ఆలీ ,పోసాని కృష్ణ మురళి హాజరైన ఎపిసోడ్లు సుమ చాలా సందడి చేసినట్లుగా ఈ ప్రోమోలో కనిపిస్తోంది. ఈ ఎపిసోడ్ లో సుమ ఆలీతో మాట్లాడుతూ చిరంజీవి గారిని కలిస్తే మీరు ఆయన మొహం ఎందుకు చూడారని అడగగా.. తనని చూడగానే చిరంజీవి గారు ఏదో రకమైన ఎక్స్ప్రెషన్ ఇస్తారని అందువల్లే ఆయనకు నా మొఖం చూడలేక నవ్వుకుంటారని ఆలీ తెలియజేశారు.