మెగా ఆఫర్ దక్కించుకున్న బేబమ్మ.. ఎట్టకేలకు అనుకున్నది సాధించిందిగా..!

ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైన ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఆ సినిమా తర్వాత దాదాపు రెండు సంవత్సరాల పాటు టాలీవుడ్ లోనే బిజీ హీరోయిన్ గా కొనసాగింది. తొలి సినిమా ఉప్పెన విడుదలకు ముందు నుంచే ఈమె మంచి గుర్తింపును సొంతం చేసుకుని వరుసగా రెండు సినిమాలుకు కమిట్ అయింది. ఇక సినిమా విడుదలై సూపర్ హిట్ అయిన నేపథ్యంలో వరుసగా సినిమాలు చేయటం మొదలుపెట్టింది. రెండు సంవత్సరాల పాటు తెలుగులో తిరుగులేకుండా వరుస‌ సినిమాలలో నటించింది.

తొలి సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయాలు పాలయ్యాయి. ఇక దీంతో ఈ ముద్దుగుమ్మ కెరీర్ కాస్త కష్టాల మయం అయింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకుంటాయి అనుకున్న సినిమాలు కూడా నిరాశ పరచడంతో ఆఫర్లు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఈమె తెలుగులో ఒక్క సినిమాలో కూడా నటించడం లేదు. మలయాళం లో మాత్రం ఒక చిన్న సినిమాలో చేస్తుంది.

కోలీవుడ్ లో మాత్రం ఓ స్టార్ హీరోతో నటించే అవకాశం సొంతం చేసుకుందనే ప్రచారం జరుగుతుంది.
అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు తెలుగులో మాత్రం ఓ మెగా ఆఫర్ వచ్చిందట. వచ్చే సమ్మర్ నుంచి ఈ సినిమా ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తుంది. మెగా హీరోతో సినిమా అంటే కృతి శెట్టి కెరీర్ మళ్ళీ గాడిన పడినట్లే అంటూ బాక్సాఫీస్ వర్గాల వారి నుంచి అందుతున్న సమాచారం. కృతి శెట్టి ఈ సినిమాతో అయినా తన కెరీర్ ను నిలదొక్కు ఉంటుందో.. లేక బొక్క బోర్లా పడుతుందో చూడాలి.