స్టార్ హీరోయిన్లను కావాలనే తొక్కేస్తున్నారా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరు అనే ప్రశ్న కి సమాధాన ఎవరూ చెప్పలేము ..ఎందుకంటే నెంబర్ వన్ అనుకుంటున్న హీరోయిన్ల చేతిలో కేవలం ఒక్క సినిమాల్లో మాత్రమే ఉన్నాయి. మరి కొంతమంది ఇతర భాషలలో నటిస్తూ ఉన్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొరత మళ్ళీ మొదలైందని చెప్పవచ్చు. తెలుగులో అగ్ర హీరోయిన్ హోదా అందుకున్న హీరోయిన్ ఒకరు కూడా లేరని వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త హీరోయిన్లు ఈ హోదాకు సరిపోరని ఉన్న హీరోయిన్లు పాతబడిపోయారని దర్శక నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారా.

Samantha, Rashmika Mandanna or Pooja Hegde, who will step into 'No Entry  Mein Entry'

నిన్న మొన్నటి వరకు నెంబర్ వన్ అనుకున్న పూజ హెగ్డే మహేష్ సినిమాలో తప్ప మరొక ఏ సినిమాలో కూడా నటించలేదు ఇక విజయ్ దేవరకొండ తో కమిట్ అయిన జనగణమన సినిమా ఆగిపోయింది. ఇక బాలీవుడ్ లో సర్కస్ ,కీసిక బాయ్ కిసీక జాన్ లాంటి చిత్రాలలో బిజీగా ఉన్న పూజ హెగ్డే తెలుగులో మాత్రం ఏ ఒక్క చిత్రంలో నటించలేదు. ఇక మరొక హీరోయిన్ రష్మిక సైతం టాలీవుడ్ లో ఒకేసారి చాలా గ్యాప్ ఇచ్చేసింది పుష్ప -2 మినహా మరొక ఏ సినిమాలో కూడా నటించలేదు బాలీవుడ్లో కూడా నటించిన పెద్దగా ఆకట్టుకోలేక పోతోంది.

ప్రస్తుతం రష్మిక పేరు సౌత్ లో కూడా పెద్దగా కనిపించలేదు. ఈమె చూపులు అన్నీ కూడా ఎక్కువగా బాలీవుడ్ వైపే ఉన్నాయి. అయితే ఈ ఇద్దరికీ కొన్ని ఆఫర్లు వస్తున్నప్పటికీ వాటిని కావాలని నిర్లక్ష్యంగా నో చెబుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సమంత కీర్తి సురేష్ మాత్రం పలు చిత్రాలలో నటిస్తున్నారు. మరి కొంతమంది మాత్రం వీరు చేసే ఓవరాక్షన్ తట్టుకోలేకనే వీళ్ళ కెరియర్ ఇలా అవుతోంది అంటూ పలువురు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Share post:

Latest