రామ్ చరణ్ కోసం తెగ ట్రై చేస్తున్న అల్లు అరవింద్.. కారణం..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. అల్లు అరవింద్ నిర్మాణంలో వచ్చిన మగధీర సినిమా ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ముఖ్యంగా ఈ ఇద్దరి కాంబినేషన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే అప్పటినుంచి ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో మళ్ళీ సినిమా రాలేదు. అందుకే అల్లు అరవింద్ ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా ఒక సినిమాను రూపొందించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని.. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. రామ్ చరణ్ అలాగే అల్లు అర్జున్ హీరోలుగా ఒక మల్టీ స్టారర్ సినిమాను చేయాలని ఆశ పడుతున్నాము అని ఆయన తెలిపారు.

అందుకోసం ఒక టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించి పెట్టాము అని.. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయిస్తున్నామని కూడా అల్లు అరవింద్ తెలిపారు. ప్రస్తుతం అల్లు అరవింద్ డేట్లు కావాలి అంటూ రాంచరణ్ అడిగిన నేపథ్యంలో మల్టీ స్టారర్ సినిమా కోసమా? లేదంటే సోలో హీరోగా రాంచరణ్ తో సినిమా చేయబోతున్నారా? అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అవ్వడానికి ఇంకా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి . మరో పక్క అల్లు అర్జున్ కూడా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సీక్వెల్ చేస్తున్న విషయం తెలిసిందే.

రామ్ చరణ్ శంకర్ సినిమా తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఇలా చూసుకున్నట్లయితే మరో మూడు నాలుగు సంవత్సరాల పాటు రామ్ చరణ్ ఖాతాలో ఒక్కొక్కటిగా సినిమాలు వచ్చి చేరుతూనే ఉన్నాయి. మరి ఎప్పటికీ అల్లుఅరవింద్ కి రామ్ చరణ్ డేట్స్ ఇస్తాడు? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.