అడివి శేష్ ఇంట పెళ్లి బాజాలు.. హ‌ల్దీ ఫోటోల‌తో షాకిచ్చిన యంగ్ హీరో!

యంగ్ అండ్‌ టాలెంటెట్ హీరో అడివి శేష్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. తాజాగా హ‌ల్దీ ఫోటోల‌తో ఈ యంగ్ హీరో అంద‌రికీ షాక్ ఇచ్చాడు. అయితే పెళ్లి అడివి శేష్ ది కాదులేదండి. ఆయ‌న చెల్లెలు పెళ్లి పీట‌లెక్క‌బోతోంది. పెళ్లిలో భాగంగా తాజాగా హ‌ల్దీ ఫంక్ష‌న్ జ‌రిగింది. ఈ ఫంక్ష‌న్ కు సంబంధించిన ఫోటోల‌ను అడివి శేష్ త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పంచుకున్నాడు.

`నా చిట్టి చెల్లికి వివాహం కాబోతోంది. సోద‌రి పెళ్లిలో అమ్మ‌, నేను సంద‌డి చేశాము. ఈ రోజు బావ డేవిన్ ను మా కుటుంబంలోకి మ‌న‌స్పూర్తిగా స్వాగతించాము` అంటూ త‌న పోస్ట్ లో అడివి శేష్‌ రాసుకొచ్చాడు. దీంతో అడివి శేష్ పోస్ట్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారింది. ఈ పిక్స్ చూసి `నీ పెళ్లెప్పుడు.. అన్నా..?` అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రికొంద‌ర మీ చెల్లికి పెళ్లి శుభాకాంక్ష‌లు అంటూ విష్ చేస్తున్నారు.

కాగా, కెరీర్ విష‌యానికి వ‌స్తే.. అడివి శేష్ బ్రేకుల్లేని హిట్స్ ను య‌మా జోరు చూపిస్తున్నారు. గ‌త ఏడాది మేజ‌ర్‌, హిట్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించి బాక్సాఫీస్ వ‌ద్ద విధ్వంసం సృష్టించిన అడివి శేష్‌.. ఇప్పుడు `గూఢ‌చారి 2` సినిమాతో అల‌రించేందుకు సిద్ధం అవుతున్నాడు.

https://www.instagram.com/p/Cnyc2Javdnj/?utm_source=ig_web_copy_link