సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడు మృతి..!!

గడిచిన కొద్ది గంటల క్రితం సీనియర్ హీరోయిన్ జమున మరణ వార్త మరువకముందే ఇప్పుడు..ప్రముఖ సినీ నటుడు డైరెక్టర్ ఇ రామదాస్ గుండెపోటుతో మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇరామదాసు వయసు 66 సంవత్సరాలు. ఈ విషయాన్ని ఇ రామదాసు కుమారుడు ధ్రువీకరించారు. సోషల్ మీడియా వేదికగా తన తండ్రి మరణాన్ని తెలియజేశారు.దీంతో ఆయన అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు పలువురి సినీ సెలబ్రెటీలు సైతం ఆయన మరణానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Visaranai fame E Ramadoss passes away at 66: K Bharathiraja, Mansoor Ali  Khan condole actor-director's deathఇక రామదాసు కుమారుడు కల్చల్వన్ సోషల్ మీడియా వేదికగా మా నాన్న దర్శకుడు, రచయిత, నటుడు, ఇ రామదాస్ గుండెపోటుతో మరణించారు. ఆయన అంత్యక్రియలు 24-1-2023 స్వగృహంలో జరుగుతాయని తెలియజేయడం జరిగింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన రామదాసు శివ కార్తికేయానికి సదామ్, నయనతార నటించిన ఆరమ్, విజయ్ సేతుపతి విక్రమ్ వేద, ధనుష్ నటించిన మారి 2, తదితర హిట్ చిత్రాలలో నటించారు రామదాసు.

రామదాసు కోలీవుడ్లో 1986లో అయర్ పూకే మలరట్టుం అనే చిత్రం ద్వారా మొదటిసారిగా దర్శకుడుగా మారారు. ఆ తరువాత ఎంతోమంది హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించారు. రచయితగా కూడా పలు చిత్రాలలో పనిచేశారు.తమిళంలో “సూయం వరం “అరే చిత్రానికి 9 మంది దర్శకులు కలిసి కేవలం ఒక్కరోజులోనే ఈ సినిమాని తెరకెక్కించారు ఇందులో డైరెక్టర్ రామదాసు కూడా ఒకరని తెలుస్తోంది. ఇక ఈయన కెరియర్ లో ఎన్నో సినిమాలకు స్క్రీన్ రైటర్ గా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

https://twitter.com/rameshlaus/status/1617684050302623745?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1617684050302623745%7Ctwgr%5E9c627ed7e507dcc1d1af8b2db68da3f77d55f062%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Faz7am.com%2Fone-more-tragedy-popular-actor-and-director-passes-away-due-to-heart-attack%2F