కేజీఎఫ్` న‌టుడితో ఏడ‌డుగులు వేసిన బాల‌య్య భామ‌.. ఫోటోలు వైర‌ల్‌!

ప్ర‌ముఖ న‌టి హ‌రిప్రియ పెళ్లి పీట‌లెక్కింది. బెంగుళూరులో జన్మించిన హరిప్రియ `తకిట తకిట` మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయింది. ఆ త‌ర్వాత నాని హీరోగా తెర‌కెక్కిన `పిల్లజమీందార్` మూవీలో హీరోయిన్ గా న‌టించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.

అలాగే `జైసింహా` న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ భార్యగా న‌టించి అల‌రించింది. ఆ త‌ర్వాత తెలుగులో ఈ అమ్మ‌డు పెద్ద‌గా క‌నిపించ‌లేదు. కన్నడలో మాత్రం వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. త‌మిళంలోనూ ప‌లు సినిమాలు చేసింది. అయితే తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటిది అయిపోయింది.

శాండల్ వుడ్ నటుడు వశిష్ట సింహతో ఆమె ఏడ‌డుగులు న‌డిచింది. ఇటీవల కొన్ని నెలల క్రితం హరిప్రియ కన్నడ నటుడు వశిష్ట సింహని నిశ్చితార్థం చేసుకున్నట్టు ప్రకటించింది. అయితే గురువారం నాడు శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలోని `పౌండరీక రంగస్థల`లో వివాహం చేసుకున్నారు.

వీరి పెళ్ళికి పలువురు కన్నడ సినీ ప్రముఖులు విచ్చేసి ఆశీర్వదించారు. వీరి పెళ్లి ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. కాగా, వ‌శిష్ట సింహా `కేజీఎఫ్` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గర‌య్యాడు. అలాగే నారప్ప, నయీం డైరీస్‌, ఓదెల రైల్వేస్టేషన్ వంటి చిత్రాల్లోనూ వశిష్ట న‌టించాడు.