2023:సంక్రాంతి మూవీస్.. ఆల్ హ్యాపీసేన..?

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సినిమాలు మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. నిర్మాతలు కానీ బయర్లు కానీ పెద్దగా నష్ట పోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పండుగకి అందరి దృష్టి నిలిచింది చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య ,బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలని చెప్పవచ్చు. ఈ రెండు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి అంచనాలను అందుకున్నాయి. వాల్తేరు వీరయ్య అదిరిపోయే వస్తువులతో బ్లాక్ బస్టర్ రేంజ్ను అందుకుంది. ముఖ్యంగా వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా బయ్యర్లను సేఫ్ జోన్ లో తీసుకుపోయింది.

Sankranti 2023: Here are 5 Telugu films gearing up for the biggest box  office clash

ఇక రానున్న రోజుల్లో మరింత వసూలు రాబట్టేలా కనిపిస్తోంది ఈ చిత్రము. ఇక వీరసింహారెడ్డి మొదటి రోజే మెజారిటీ షేర్ తెచ్చుకోవడంతో ఆ తర్వాత జోరు తగ్గిందని చెప్పవచ్చు. అయితే B,C సెంటర్లలో ఇప్పటికీ ఈ చిత్రం మంచి షేర్ ను రాబడుతోంది. ఈ రెండు పెద్ద సినిమాలు అందరిని సంతోషంలో ముంచాయి. ఇక దిల్ రాజు అనువాద చిత్రంగా విడుదలైన వారసుడు సినిమా లేటుగా బరిలోకి దిగినప్పటికీ దాని స్థాయిలో అది మంచి వస్తువులను రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక తెలుగులో విజయ్ సినిమాలో అత్యధికంగా సాధించిన చిత్రంగా వారసుడు సినిమా నిలిచింది.

ఇక వీరందరితోపాటు తెలుగులో అనువాద చిత్రంగా తెగింపు సినిమా విడుదలై మంచి కలెక్షన్లను రాబట్టింది. తక్కువ పెట్టుబడి కావడం వల్ల ఈ సినిమా కూడా బ్రేక్ ఈవెన్ సాధించినట్లు సమాచారం. ఇక అలాగే కళ్యాణం కమనీయం సినిమా కంటెంట్ పరంగా నిరాశపరిచినప్పటికీ ఓవరాల్గా ఒక మోస్తారు కలెక్షన్లను మాత్రం రా పట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఎవరు కూడా ఈ సంక్రాంతికి నష్టపోలేదని తెలుస్తోంది మొత్తం అంతా ఆల్ హ్యాపీ అన్నట్లుగా సమాచారం