కృతి శెట్టికి వాయిస్ ఓవర్ అందించే డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరంటే…?

నూతన దర్శకుడు బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో చిరు మేనల్లుడు వైష్ణవ తేజ్ ‘ఉప్పెన’ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్‌గా కృతి శెట్టి కనిపించి అందరి హృదయాలను దోచేసింది. ఈ సినిమాలో బేబమ్మగా క్యూట్ అవతారంలో కృతి కనిపించింది. రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి సినీ ప్రేక్షకులకు చెమటలు పట్టించింది. అలా ఫస్ట్ తెలుగు సినిమాతోనే బీభత్సమైన పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత శ్యామ్‌ సింగ రాయ్‌, బంగార్రాజు, ది వారియర్‌, మాచర్ల నియోజకవర్గం సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. రీసెంట్‌గా ఆమె నటించిన ‘అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ మూవీ ఫ్లాప్ అయింది కానీ తన పర్ఫామెన్స్ మాత్రం హైలెట్ అయింది.

నిజానికి ఇప్పటివరకు రిలీజ్ అయిన కృతి సినిమాల్లో ఆమె కంటే ఆమె మాటలే మరింత క్యూట్‌గా ఉండి చాలామందిని ఫిదా చేశాయి. ఆమె ముద్దు ముద్దు మాటలకు ఎందరో ఎట్రాక్ట్ అయ్యారు. అయితే నిజానికి ఆమె సినిమాల్లో సొంతంగా డబ్బింగ్ చెప్పుకోదు. ఆన్‌స్క్రీన్‌పై ఆమె నోటి ద్వారా వినపడే మాటలన్నీ వేరే యువతి చెబుతుంది. ఆమె మరెవరో కాదు ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్టు శ్వేతా. శ్వేత స్వస్థలం విశాఖపట్నం. ఆమె చిన్నతనం నుంచే సినిమా, థియేటర్ పట్ల చాలా ఇష్టం చూపించేది. అలా డిగ్రీ పూర్తి చేసుకొని హైదరాబాద్ వచ్చింది. ఆమె ఒక తెలుగు సీరియల్ కోసం అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా జాయిన్ అయింది.

ఒక యూట్యూబ్ ఛానెల్‌కి కూడా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరింది. ఆపై ఒక వార్తా ఛానెల్‌కి సబ్ ఎడిటర్‌గా తన ఉద్యోగాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత మిర్చిలో రేడియో జాకీగా అవకాశం వచ్చింది. చివరగా ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ అయింది. అలాగే ఆమె తన సొంత యూట్యూబ్ ఛానెల్ కోసం ‘Swifi’ స్టార్ట్ చేసి చాలా విషయాలను పంచుకుంటుంది. కాజల్ అగర్వాల్, నివేదా పేతురాజు వంటి తదితర హీరోయిన్లకు కూడా ఈ బ్యూటిఫుల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ తన క్యూట్ వాయిస్ అందించి ప్రేక్షకులను అలరించింది. ఇక ఉప్పెన మూవీ నుంచి కృతికి తన వాయిస్ ఓవర్ అందిస్తోంది.