వీరసింహారెడ్డికి బలం ఆమెనా.. అందుకే అంత ధైర్యం..!!

టాలీవుడ్ లో నటుడు బాలయ్య యాక్టింగ్ గురించి బ్యాగ్రౌండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి కుటుంబంలో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ అదే తరహాలో తన హవా కొనసాగిస్తూ ఉన్నారు. అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బాలయ్య తన తదుపరిచిత్రం కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రమే వీరసింహారెడ్డి.

NBK107: Actress Varalakshmi Sarathkumar Joins Nandamuri Balakrishna In  Director Gopichand Malineni's Filmఈ సినిమా సంక్రాంతి బరిలో వచ్చే ఏడాది విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ నటించింది. ఈ చిత్రంలో హీరోనే కాకుండా పలు కీలకమైన పాత్రలో కొన్ని ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ పాత్రలు ఈ సినిమా కథకు మలుపు తిప్పేలా ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఉండే ఎమోషన్స్ చాలా కీలకంగా మారుతూ ఉంటాయని తెలుస్తోంది. అలాంటి పాత్రలలోనే హీరోయిన్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ నటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకి ఈమె పాత్ర హైలైట్ గా నిలిచేలా కనిపిస్తున్నట్లు సమాచారం.

వీర సింహారెడ్డి సినిమా లో వరలక్ష్మి పాత్ర ఈ సినిమాకి గ్రాఫ్ ని పెంచే స్థాయికి వెళుతుందని సమాచారం. వరలక్ష్మి ఇదివరకు ఎన్నో పాత్రలు చేసింది కానీ ఈ సినిమాలో ఒక సపరేటు పాత్ర ఉందని చెబుతున్నారు చితర బృందం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నది. వీర సింహారెడ్డి సినిమా మొత్తం వరలక్ష్మి నటన పైనే డిపెండ్ కావడం చేత చాలా ధైర్యంగా ఉన్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అందుచేతను ఎన్ని సినిమాలు పోటీ పడ్డ కూడా మా చిత్రం విజయం సాధిస్తుందని చిత్ర బృందం ధీమా చేయడంతో ఈ సినిమాని సంక్రాంతి బదులు దింపుతున్నట్లు తెలుస్తోంది. మరి చిత్ర బృందం నమ్మకాన్ని వరలక్ష్మి నిలబెడుతుందేమో చూడాలి మరి.