తెలుగు సినీ ప్రేక్షకులకు కోలీవుడ్ హీరో విశాల్ సుపరిచితమే తెలుగు వారే అయినప్పటికీ చెన్నైలో వెళ్లి సెటిల్ కావడంతో అక్కడే సినిమాలతో బిజీగా ఉంటు తెలుగు ప్రేక్షకులను కూడా పలకరిస్తూ ఉంటారు. తెలుగులో సినిమాలను డబ్ చేసి విడుదల చేస్తూ ఉంటారు. విశాల్ నటించిన తాజా చిత్ర లాఠీ. ఈనెల 22వ తేదీన విడుదల కాబోతోంది ఈ చిత్రం తమిళంతోపాటు తెలుగులో కూడా చాలా గ్రాండ్గా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ ను తిరుపతిలో నిర్వహించడం జరిగింది.
శ్రీ విద్యానికేతన్ క్యాంపస్ లో విశాల్ ఈ సినిమా ఈవెంట్ను చాలా ఘనంగా నిర్వహించారు. అందుకు మోహన్ బాబు చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యి.. ఈవెంట్లో మోహన్ బాబు గారు పలు విషయాలను తెలియజేశారు. మోహన్ బాబు మాట్లాడుతూ ఎం ధర్మరాజు దర్శకత్వంలో సినిమా చేస్తున్న సమయంలో తాను చిన్నపిల్లాడిగా ఉన్నారు. ఒక పక్కన తాను కూర్చొని చూస్తూ ఉంటే మోహన్ బాబు తనని పిలిచి తన తండ్రికి మీ వాడిలో సినిమా కళ ఉంది నటుడు అవుతానని చెప్పానని గుర్తు చేశారు మోహన్ బాబు.
మోహన్ బాబు గారు అలా చెప్పడం వల్లే తాను ఈరోజు నేను నటుడుగా మీ ముందు ఉన్నానని విశాల్ కూడా తెలిపారు. దీంతో మోహన్ బాబుకు కూడా థాంక్స్ చెప్పారు విశాల్. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటే చాలు కలర్ స్టైల్ తో సంబంధం లేదని విశాల్ చూస్తే అర్థమవుతుందని చెప్పవచ్చు. మాస్ హీరోగా విశాల్ తన స్టామినా ఏంటో ప్రస్తుతం ప్రూఫ్ చేసుకుంటున్నారని చెప్పవచ్చు. తమిళ హీరోని అయినప్పటికీ తెలుగు ఆడియన్స్ తనపై చూపిస్తున్న ప్రేమకి ఎప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు విశాల్.