వెంక‌టేశ్- సౌందర్య మ‌ధ్య అ రహ‌స్య బంధం.. ఇన్నాళ్ల‌కు ఈ సీక్రెట్ బ‌య‌ట‌కొచ్చింది…!

సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఉన్నా కోన్ని జంట‌లను చుస్తే వారిని నిజమైన జంట‌ల‌గా అనిపిస్తాయి. వారు ప్రేక్షకుల హృదయాలలో రియల్ జోడీల స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకుంటారు. ఇక అలా టాలీవుడ్ లు కూడా వెంకటేశ్-సౌందర్య కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో ఎంతో మంచి గుర్తింపు ఉంది. వీరి కాంబినేషన్ లో టాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు వ‌చ్చాయి.

Soundarya Birth Anniversary The late Telugu actress would have celebrated  her 50th birthday today

తాజాగా ఓ యుట్యూబ్ ఛాన‌ల్‌కు వెంక‌టేశ్‌ పర్సనల్ మేకప్ మేన్ రాఘవ ఇచ్చిన‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించారు. వెంక‌టేశ్ తండ్రి రామానాయుడు చనిపోయిన సమయంలో ఆ బాధ నుంచి వెంకటేశ్ కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని.. ఒక వారం రోజుల పాటు ఇంటికి వెళ్లకపోతే అయ‌న నాకు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావని అడిగి నా సమాచారం తెలుసుకునే వారని రాఘవ తెలిపాడు.

వెంక‌టేశ్ గారికి నేను మేకప్ వేస్తుంటే వెంకటేశ్ కన్నీళ్లు పెట్టుకునేవారని రాఘవ కామెంట్లు చేశాడు. తండ్రీ, కొడుకుల మధ్య ఎంతో మంచి అనుబంధం ఉందని రాఘవ చెప్పుకొచ్చారు. నాన్న పేరు వినిపిస్తే వెంకటేశ్ కు కళ్లు ఎర్రబడేవని ఆయన అన్నాడు. వెంకటేష్ ఎంతో సెన్సిటివ్ అని రాఘవ అన్నాడు. ఇక వెంకటేశ్- సౌందర్య గురించి వ‌చ్చిన గాసిప్ప్ గురించి కూడా రాఘ‌వా మాట్ల‌డుతు.. అప్ప‌ట్లో వారి మ‌ధ్య ఏదో ఉంది అంటూ వ‌చ్చిన వార్త‌లో నిజం లేదని అయ‌న‌ చెప్పుకొచ్చారు.

 Raghava Comments About Victory Venkatesh Details Here Goes Viral ,saundarya, Rag-TeluguStop.com

వీరిద్ద‌రి కాంబోలో ఏడు సినిమాలు చేయడం వల్ల అలాంటి వార్తలు వచ్చాయని ఆయన అన్నాడు. సౌందర్య చనిపోయే వరకు వెంకటేశ్ గారిని సార్ అనే పిలిచేదని రాఘవ కామెంట్లు చేశాడు. అలాంటి వార్త‌లను వెంకటేశ్ ఎప్పుడు పట్టించుకోరని ఆయన అన్నారు. సౌందర్య ఇంటికి వెళ్లిన సమయంలో కూడా వెంకటేశ్ గారికి, నాకు ఆమె భోజ‌నం వడ్డించిందని ఆయన అన్నాడు.

సౌందర్య చాలా మంచి అమ్మాయి అని… సౌందర్య చనిపోయిన సమయంలో కూడా వెంకటేశ్ చాలా బాధ పడ్డారని ఆయన పేర్కొన్నాడు. దీంతో పాటు వెంక‌టేశ్ ఘర్షణ సినిమా షూట్ సమయంలో శ్రీలంకలో బోట్ తిరగబడి వెంకటేశ్ కు, సినిమా యునిట్‌ కు యాక్సిడెంట్ అయిందని రాఘవ వెల్లడించాడు. అయితే రాఘ‌వ‌ చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మ‌రాయి.