అబ్బే..ఆ విషయంలో విజయ్ దేవరకొండ కి అంత సీన్ లేదు..రానా ది బెస్ట్..!?

తెలుగులోనే అతి పెద్ద రియాలిటీ షో గా స్టార్ట్ అయిన బిగ్ బాస్ రీసెంట్ గానే ఆరో సీజన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది. కాగా మొదటి సీజన్ కి ఎన్టీఆర్.. తర్వాత సీజన్ నాని హోస్ట్ చేసిన ఈ షో బిగ్ బాస్ సీజన్ 3 నుంచి బిగ్ బాస్ సీజన్ 6 వరకు నాగార్జుననే హోస్టుగా చేశారు, కాగా ఇన్ని సీజన్స్ ఆయన్ని హోస్ట్ గా చూసి చూసి జనాలకు బోర్ కొట్టేసింది . ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి కొత్త హోస్ట్ కావాలి అంటూ సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు బిగ్ బాస్ అభిమానులు .

కాగా బిగ్ బాస్ సీజన్ 6 లాస్ట్ ఫైనల్ ఎపిసోడ్ ఎంత దరిద్రంగా జరిగిందో అందరికీ తెలిసిందే. గెలిచింది ఒకరు.. కప్పు అందుకుంది మరొకరు.. క్యాష్ అందుకుంది ఇంకొకరు ఇలా నానా చెత్తగా నాగార్జున షో పాడు చేశాడని ..ఇక ఆయన్ని షోలో హోస్టుగా భాగం చేయొద్దని స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే బిగ్ బాస్ నిర్వహకులు కొత్త హోస్ట్ కోసం ట్రై చేస్తున్నారట . కాగా మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ..నాగార్జున ప్లేస్ లోకి ఇప్పుడు మరో కొత్త హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది .


ఆయన మరెవరో కాదు దగ్గుబాటి వారసుడు రానా . ఎస్ హీరోగా తన కెరియర్ను స్టార్ట్ చేసి విలన్ గా కొనసాగిస్తున్న రానా ..నంబర్ వన్ యారి కి హోస్టుగా చేసి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు తనదైన స్టైల్ లో నవ్వించి కవ్వించడం రానా కు వెన్నతో పెట్టిన విద్య.. ఇలాంటి రానా అయితే హోస్ట్ బాగుంటాడు అని జనాలు చెప్పుకొస్తున్నారు . అయితే గతంలో సీజన్ సిక్స్ కి సైతం విజయ్ దేవరకొండ హోస్ట్ గా రాబోతున్నాడని వార్తలు వినిపించాయి.

ఇదే క్రమంలో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సైతం విజయ్ దేవరకొండ లాంటి నాటీ హీరో షో ని హోస్ట్ చేస్తే చటిఆర్పి రేటింగ్స్ ఎక్కడికో వెళ్లిపోతాయని సజీషన్స్ ఇస్తున్నారు . అయితే రానా అభిమానులు మాత్రం మీ హీరోకి అంత సీన్ లేదని ..డైలాగ్ చెప్పడమే రాని వాడికి షో ఎలా హోస్ట్ చేస్తాడని కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోని సోషల్ మీడియాలో బిగ్ బాస్ సీజన్ సెవెన్ హోస్ట్ గా ఎవరు చేయబోతున్నారు అంటూ ఇంట్రెస్టింగ్ చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే కొందరు రానాకి ఓటు వేస్తుంటే మరి కొందరు విజయ్ దేవరకొండకు ఓటేస్తున్నారు . మరి మీరు ఎవరు అనుకుంటున్నారు రానా నా..? విజయ్ దేవరకొండ నా..?