ఆళ్లగడ్డ వైసీపీలో ట్విస్ట్..గంగులకు సొంత రిస్క్..!

గత ఎన్నికల్లో కొంతమంది సీనియర్ నేతలు తమ వారసులని ఎన్నికల రంగంలోకి దింపి సక్సెస్ అయిన విషయం తెలిసిందే. అలా సక్సెస్ అయిన వారిలో గంగుల ప్రభాకర్ రెడ్డి కూడా ఒకరు. సీనియర్ నేత అయిన గంగుల..2019 ఎన్నికల్లో ఆళ్లగడ్డ సీటు తన తనయుడు బిజేంద్రరెడ్డికి ఇప్పించుకున్నారు. ఇక జగన్ వేవ్‌లో బిజేంద్ర భారీ మెజారిటీతో టీడీపీ నుంచి పోటీ చేసిన భూమా అఖిలప్రియపై గెలిచారు.

ఇక తొలిసారి ఎమ్మెల్యేగా  గెలిచిన తనదైన శైలిలో దూసుకెళుతున్నారు. ఓ వైపు అఖిలప్రియకు సొంత ఫ్యామిలీలో ఇబ్బందులు ఉన్నాయి. దీని వల్ల నెక్స్ట్ ఎన్నికల్లో ఆమెకు సీటు దొరుకుతుందో లేదో క్లారిటీ లేదు. అయితే బిజేంద్రకు అంతా కలిసొస్తుందనుకునే సమయంలో..ఆ ఫ్యామిలీలో కూడా కొంత గ్యాప్ పెరిగింది. గంగుల బ్రదర్స్ సెపరేట్ అయ్యారు. గంగుల ప్రతాప్ రెడ్డి..సెపరేట్ గా జై గ్రేటర్ రాయలసీమ అంటూ గళం విప్పుతున్నారు. ప్రతాప్ రెడ్డి పలుమార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేశారు. అలాగే ఆయనకు నంద్యాల, ఆళ్లగడ్డ స్థానాలపై పట్టు ఉంది.

గత ఎన్నికల్లో తన సోదరుడు ప్రభాకర్ రెడ్డి తనయుడు బిజేంద్ర విజయం కోసం పనిచేశారు. ఇప్పుడు ఆయన సెపరేట్ గా జై గ్రేటర్ రాయలసీమ అని చెప్పి కొత్తగా ఆఫీసు ప్రారంభించారు. దీనికి మైసూరా రెడ్డి, ఏరాసు ప్రతాప్ రెడ్డి..అలాగే కొందరు టీడీపీ, వైసీపీ నేతలు కూడా వచ్చారు. నంద్యాలలో ఆఫీసు ప్రారంభించగా ఆళ్లగడ్డ నుంచి కొందరు వైసీపీ శ్రేణులు వచ్చాయి.

అయితే వచ్చే ఎన్నికల్లో తన తనయుడు ఫణికృష్ణారెడ్డిని రాజకీయంగా బలపర్చడానికే ప్రతాప్ రెడ్డి ఇలా ముందుకెళుతున్నారని తెలుస్తోంది. ఇక ఫణి వచ్చి..కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరాశివారెడ్డి అల్లుడు. ప్రస్తుతం శివారెడ్డి కమలాపురం టీడీపీ సీటు కోసం ట్రై చేస్తున్నారు. ఇటు ఫణి సైతం వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారు. ఏ పార్టీ అనేది క్లారిటీ లేదు. కానీ ఇలా ప్రతాప్ సెపరేట్ గా రాజకీయాలు చేయడం..ఎమ్మెల్యే బిజేంద్రకు కాస్త నష్టమే అని చెప్పవచ్చు.