ఫస్ట్ టైం..అన్ స్టాపబుల్ పై దారుణమైన ట్రోలింగ్..కారణం ఇదే..!!

నందమూరి బాలయ్య హోస్ట్ చేస్తున్న షో అన్ స్టాపబుల్. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా లో బాలయ్య యాంకర్ గా చేస్తున్న ఈ షో హ్యూజ్ టీఆర్పీ రేతింగ్ తో దూసుకుపోతుంది. కొన్ని అనివార్య కారణాల కారణంగా సీజన్ 1 కి రాలేక ఆగిపోయిన గెస్ట్ లను సీజన్ 2 కి పిలిపించి గెస్ట్ గా ఇంటర్వ్యూ చేస్తున్నారు . రీసెంట్ గా షో కి సీనియర్ బ్యూటీస్ జయప్రద , జయసుధ అలాగే యంగ్ బ్యూటీ రాశి కన్నా వచ్చారు. దీనికి సంబంధించిన పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆహ . ప్రోమో ని కూడా త్వరలోనే విడుదల కాబోతుంది అంటూ చెప్పుకొచ్చింది.

కాగా ఈ క్రమంలోని సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురవుతుంది సీజన్ 2 . ఇప్పటివరకు ట్రోలింగ్కి గురవ్వని అన్ స్టాపబుల్ షో రాశిఖన్నా కారణంగా ట్రోలింగ్కి గురవుతున్నట్టు తెలుస్తుంది. బాలకృష్ణ తో హీరోయిన్ గా నటించిన జయప్రద , జయసుధను గెస్ట్ గా ఆహ్వానించారు.. ఓకే ..మరి మధ్యలో పానకంలో పుడకల రాశిఖన్నా ఎందుకు అంటూ ట్రోల్ చేస్తున్నారు .

అసలు వాళ్ళకి ఆమెకి ఏ సంబంధం లేదు ..ఏదో పిలిపించాలని పిలిపించారు అంటూ చెప్పుకొస్తున్నారు. మరికొందరు అల్లు అరవింద్ కి రాశి ఖన్నా ఫేవరెట్ హీరోయిన్ అని ..ఈ క్రమంలోనే ఆమెను పిలిపించారని.. క్రేజీ గాసిప్ వైరల్ గా మారింది . ఏది ఏమైనా సరే ఫస్ట్ టైం అన్ స్టాపబుల్ షో ఇలా ట్రోలింగ్ కి గురవ్వడంతో.. నందమూరి ఫ్యాన్స్ తీవ్రంగా హర్ట్ అవుతున్నారు.