యాక్ట్రెస్ రాధలో అదే ఉత్సాహం, అదే అందం.. మనసులు దోచేస్తోంది కదా..

ఒకప్పటి నటి రాధ ఎన్నో మంచి మంచి సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు జనరేషన్ వారికి రాధ గురించి ఎక్కువగా తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆమె వెండి తెరపై కనపడక 30 ఏళ్లు దాటింది. 1980 కాలంలో రాధ టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. దాదాపు రెండు తరాల హీరోలతో కలిసి నటించింది. కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి ఒక తరం హీరోలతో పాటు, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి రెండవ తరం హీరోలతో కూడా జత కట్టి అలరించింది. ఒకప్పుడు రాధ పేరు వినగానే డ్యాన్స్ గుర్తువచ్చేది. అప్పట్లో చిరంజీవితో పోటీపడుతూ మరి రాధ స్టెప్పులు వేసేది. ఒక దశబ్దం వరకూ రాధ తిరుగులేని హీరోయిన్‌గా టాలీవుడ్‌లో రాణించింది.

దాదాపు 30 ఏళ్లు గ్యాప్ తీసుకున్న రాధ మళ్ళీ బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే వేదికపై గెస్ట్‌లలో ఒకరిగా దర్శనమిచ్చింది. ప్రస్తుతం రాధకి 57 ఏళ్లు, అయిన కూడా ఆమెలో ఉన్న ఎనర్జీ, కాన్ఫిడెన్స్ అందరినీ ఆశ్చర్య పరిచాయి. రాధ కాస్త బొద్దుగా అయ్యారు కానీ వృధాప్య ఛాయలు ఏమాత్రం కనిపించలేదు. ఆమె యాక్టీవ్‌గా మాట్లాడే విధానం చూసి ప్రేక్షకుల ఆమెపై నుండి కళ్లు తిప్పుకోలేకపోయారు. విషయం ఏంటంటే రాధ మళ్లీ రీ-ఎంట్రీ ఇవ్వబోతుందట. రాధ అభిమానులకి ఇదొక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. త్వరలో ప్రారంభం అవబోతున్న బీబీ జోడిలో జడ్జిగా రాధ బుల్లితెరపై సందడి చేయనుంది. దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ కాగా అందులో రాధ అందాలకి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అప్పటికీ, ఇప్పటికీ ఆమెలో ఏమాత్రం అందం తగ్గలేదు, ఉత్సాహం కూడా అలానే ఉందని కామెంట్లు చేస్తున్నారు.

ఇక రాధ ఇద్దరు కూతుర్లు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కానీ నిలదొక్కుకోలేకపోయారు. రాధ పెద్ద కూతురు కార్తీక తెలుగు సినిమా ‘జోష్’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కథ పరంగా జోష్ బాగానే ఉన్న బాక్సఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. ఆ తరువాత రంగం సినిమాలో హీరో జీవ సరసన కార్తీక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషలో మంచి విజయం సాధించింది. దాంతో కార్తీకకి దమ్ము సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం వచ్చింది. ఈ చిత్రం కూడా విజయం సాధించలేకపోయింది. ఇక 2015లో కార్తీక వెండితెరకు గుడ్ బై చెప్పేసింది. ఇక కార్తీక చెల్లి తిలిసిని డైరెక్టర్ మణిరత్నం ‘ కడలి’ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేసారు. తులసి కేవలం రెండు సినిమాలలో నటించి ఇండస్ట్రీ నుండి వెళ్లిపోయింది. రాధ నట వారసత్వాన్ని ఆమె ఇద్దరు కూతుర్లు నిలబెట్టలేకపోయారు.