ఉపాసన ప్రెగ్నెంట్ అని తెలియగానే..ఎన్టీఆర్ ఏం చేసాడో తెలుసా..!!

మెగాస్టార్ కోడలు ఉపాసన తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. దీంతో మెగా ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు . గత పదేళ్లుగా ఉపాసన తల్లి అయ్యితే చూడాలన్నది మెగా ఫ్యాన్స్ కల. ఈ క్రమంలోనే అలాంటి ఓ క్రేజీ న్యూస్ ని జనాలకు అందించాడు మెగాస్టార్ చిరంజీవి . అప్పటినుంచి సోషల్ మీడియాలో మెగాస్టార్ కోడలు ఉపాసనకు సంబంధించిన నానా రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి .

కొందరు సరోగసి ప్రాసెస్ ద్వారా ఆమె తల్లి కాబోతుంది అంటుంటే.. మరికొందరు కొన్ని ట్రీట్మెంట్స్ ద్వారా ఆమె గర్భం దాల్చినట్టు చెప్పుకొస్తున్నారు. అంతేకాదు ఉపాసన గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారు. ఇన్నేళ్లుగా ఉపాసన ఎందుకు ఇలాంటి ప్రాసెస్ ఫాలో అవ్వలేదు అన్న వార్తలు ఎక్కువైపోయాయి . అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం ఎవరూ ఏమనుకున్నా తమ వదిన తల్లి కాబోతుందని ..మెగాస్టార్ కి వారసుడు రాబోతున్నారని ..మెగా పవర్ స్టార్ రాంచరణ్ తండ్రి కాబోతున్నాడని తెలిసి ఆనంద పడుతున్నారు.

ఈ క్రమంలోనే సినిమా స్టార్స్ , ఫ్యామిలీ ఫ్రెండ్స్ , పర్సనల్ ఫ్రెండ్స్.. అందరూ రాంచరణ్ కు స్పెషల్గా విషెస్ చెబుతున్నారు . కాగా అందరికన్నా క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్ అయినా తారక్.. ఉపాసన ప్రెగ్నెంట్ అని తెలియగానే సొంత అన్నల భావించి పుట్టింటి సారెను మెగా కోడలు ఉపాసనకు పంపించారట . తాను ఇండియాలో లేకపోయినా సరే ఆ విషయాన్ని అఫిషీయల్ గా కన్ ఫామ్ చేసుకోగానే..పట్టుచీరను. గాజులను, పూలు, పండ్లు, స్వీట్స్ ను పుట్టింటి సారెగా ఉపాసనకు పంపించారట. ఈ విషయం తెలుసుకున్న మెగా – నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. వాళ్ల ఫ్రెండ్ షిప్ ఎప్పుడు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నారు..!!