రెబల్ స్టార్ ప్రజెంట్ చేస్తున్న అన్ని సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కుతున్నాయి. మరి ముఖ్యంగా బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్..ఏ రేంజ్ లో మారిపోయిందో మనకు తెలిసిందే . ఒక్కొక్క సినిమాకి దాదాపు 120 కోట్లు పారితోషకం అందుకుంటున్నాడు అంటేనే ప్రజెంట్ ఆయన ఎలాంటి పొజిషన్లో ఉన్నాడు మనం ఊహించుకోవచ్చు. అయితే తాను చేసే అన్ని సినిమాలను పాన్ ఇండియా రేంజ్ లోనే సెలెక్ట్ చేసుకుంటున్న ప్రభాస్.. ఎవరు ఊహించిన విధంగా మారుతి డైరెక్షన్లో సినిమా కమిట్ అయి అభిమానులకు షాక్ ఇచ్చాడు .
ఎప్పుడో ఒక మాట ఇచ్చిన కారణంగా ప్రభాస్ మారుతితో సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ గతంలోనే వార్తలు వినిపించాయి, కాగా ఇప్పటివరకు ఈ సినిమా గురించి అఫీషియల్ ప్రకటన చేయనప్పటికీ బ్యాగ్రౌండ్ లో మాత్రం పూర్తి పనులు జరిగిపోతున్నాయి. రాజా డీలక్స్ అంటూ పేరు కూడా ఫిలిం ఛాంబర్ రిజిస్టర్ చేసుకున్నారు. అంతేకాదు మొదటి షెడ్యూల్ కూడా ఈ సినిమా ఫినిష్ చేసుకుంది. త్వరలోనే రెండో షెడ్యూల్ ఫిక్స్ చేసుకుంటుంది . కాగా ఈ క్రమంలోని సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .
ఈ సినిమాలో ప్రభాస్ కి అక్కగా పవన్ లక్కీ హీరోయిన్ భూమిక నటించబోతున్నట్లు తెలుస్తుంది . మనకు తెలిసిందే సెకండ్ ఇన్నింగ్స్ లో అక్క, వదిన క్యారెక్టర్లు చేస్తూ లైఫ్ని ముందుకు తీసుకెళుతున్న భూమిక హీరోయిన్ కి మించిపోయి అందం ఉంది . అయినా కానీ ఎందుకో ఆమెకు అక్క , వదిన పాత్రలే ఇస్తున్నారు డైరెక్టర్స్. ఈ క్రమంలోనే ప్రభాస్ లాంటి బాడీ బిల్డర్ పక్కన భూమిక లాంటి సెన్సిటివ్ హీరోయిన్ ని అక్కగా సెలెక్ట్ చేయడంపై ట్రోల్ చేస్తున్నారు . ప్రభాస్ ఏమో ఆరడుగుల అందగాడు ..భూమిక ఏమో భూమికి జానుడు ఉంటుంది.. మరి వీరిద్దరి కాంబో ఎలా అనిపించింది నీకు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే ఇక్కడ ఈ కాంబో సెట్ అయి హిట్ అయితే మాత్రం డైరెక్టర్ థింకింగ్ కి దండం పెట్టాల్సిందే.. బాక్సులు బద్దలు అవ్వాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు . చూడాలి మరి ఈ కాంబో రేంజ్ లో జనాలను మెప్పిస్తుందో..?