DJ టిల్లు సినిమా సీక్వెల్లో జరిగింది ఇదే అంటున్న శ్రీలీల..!!

టాలీవుడ్ లో ట్రెండీగా ఉన్న హీరోయిన్లలో శ్రీ లీలా మొదటి స్థానంలో ఉందని చెప్పవచ్చు. పెళ్లి సందడి సినిమాతో మొదటిసారిగా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. కన్నడ ఇండస్ట్రీలో పలు చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక రీసెంట్గా ధమాకా చిత్రం తో మంచి విజయాన్ని అందుకుంది. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. దీంతో శ్రీలీలాకు వరుస ఆఫర్లు వెలబడుతూనే ఉన్నాయి. దీంతో ఈ అమ్మడి చేతినిండా సినిమాలతో చాలా బిజీగా ఉంటోంది.

How Sree Leela & DJ Tillu Missed Golden Oportunityఇటీవలే ఒక క్రేజీ ప్రాజెక్టు నుంచి ఈ ముద్దుగుమ్మ తప్పుకున్నట్లుగా వార్తలు వినిపించాయి. ఈ ఏడాది విడుదలైన సూపర్ హిట్ చిత్రాలలో డీజే టిల్లు సినిమా కూడా ఒకటి ఇందులో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించారు. ఇక త్వరలోనే ఈ చిత్రం సీక్వెల్ రాబోతోంది అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ చిత్రం కోసం ఎంపిక చేసిన హీరోయిన్స్ శ్రీ లీల కూడా ఒకరిని వార్తలు వినిపించాయి. అయితే అనూహ్యంగా ఈమె తప్పుకుందనే వార్తలు కూడా మళ్లీ వైరల్ గా మారాయి. అయితే ఈ విషయంపై తాజాగా శ్రీ లీల స్పందించడం జరిగింది.

ఒక ఇంటర్వ్యూలో శ్రీ లీలా మాట్లాడుతూ ఇదంతా కేవలం ఒక రూమర్ మాత్రమే అంటూ తెలియజేసింది. తాను ఆ సినిమా అని అసలు ఒప్పుకోలేదని ఏదైనా సినిమా ఓకే చేస్తే నేను ముందుగా సోషల్ మీడియా వేదికగానే తెలియజేస్తానని తెలిపింది. దీంతో డీజే టిల్లు సినిమా నుంచి శ్రిలిలా తప్పుకున్నది కేవలం ఒక రూమర్ మాత్రమే అని తెలియజేస్తుంది. ప్రస్తుతం వైష్ణవ తేజ్ తో కూడా ఒక సినిమాలో నటిస్తోంది.