గోపీచంద్ విలన్ గా మారడానికి కారణం అదేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మ్యాచ్ స్టార్ గా పేరు పొందారు గోపీచంద్. మొదట తొలివలపు అనే సినిమాతో 2001లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ తన మొదటి సినిమాతో భారీ డిజాస్టర్ నే చవిచూశారు. దీంతో హీరోగా అవకాశాలు రాకపోవడంతో విలన్ గా పలు సినిమాలలో నటించి మెప్పించారు. దీంతో గోపీచంద్ కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగిపోయిందని చెప్పవచ్చు. అయితే విలన్ గా ప్రేక్షకులకు కనెక్ట్ అయిన గోపీచంద్ మళ్లీ హీరోగా సక్సెస్ అయ్యేందుకు పలు చిత్రాలలో నటించారు. అవి కూడా బాగానే సక్సెస్ అందుకున్నాయి.

Jayam Movie || Sada, Gopichand Marriage Sentiment Scene || Nitin & Sadha -  YouTube

అలనాటి డైరెక్టర్ టి కృష్ణ కొడుకు కావడం చేత ఇండస్ట్రీలోకి ఎంట్రీ సులువుగానే అయింది. కానీ ఆ తర్వాత సినిమా అవకాశాలు రాలేకపోవడంతో డైరెక్టర్ తేజ కృష్ణవంశీ సహాయంతో విలన్ గా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించానని తెలియజేశారు. వీరి వల్లే విలన్ గా సినిమాలలో నటించవలసి వచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గడిచిన కొద్ది సంవత్సరాల నుంచి గోపీచంద్ కు వరుసగా ప్లాప్స్ ఎదురవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా పలు అవకాశాలు వెలబడుతూనే ఉన్నాయి. ఇక తన తోటి హీరోలు అందరూ కూడా అభిమానులు సంఘాలు అంటూ చాలా గోలగోలగా చేస్తూ ఉంటే గోపీచంద్ మాత్రం చాలా సైలెంట్ హీరోగా పేరు పొందారు.

గోపీచంద్ ఇప్పటికి సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 20 సంవత్సరాలు పైనే కావస్తోంది. అయితే తన కెరియర్ లో తక్కువ సినిమాలు చేయడానికి గల కారణాలు చాలానే ఉన్నాయని.. ముఖ్యంగా ప్రేక్షకులు హీరో నుంచి విలన్ మారినప్పుడు మళ్లీ హీరోగా చేస్తున్న సమయంలో విలన్ గానే చూడడం వల్ల చాలా తక్కువ సినిమాలే చేయవలసి వచ్చిందని తెలిపారు. తన మొదటి సినిమా తొలివలపు సినిమా ఫ్లాప్ కావడంతో తనకి ఆ సమయంలో అవకాశాలే రాకపోవడంతో విలన్ గా నటించాల్సి వచ్చిందని తెలిపింది.